లీకైన ట్రైలర్‌తో రికార్డులు.. హీరోకి జై కొట్టిన RGV
పవర్ స్టార్ సినిమాతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాభాలు ఏ స్థాయిలో అందుకుంటాడో తెలియదు గాని ప్రమోషన్స్ విషయంలో మాత్రం డోస్ గట్టిగానే పెంచుతున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా పవర్ స్టార్ పోస్టర్స్ తో ట్విట్టర్ ని షేక్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసిన వర్మ ఉహీంచని విదంగా ప్రమోట్ చేస్తుండడం విశేషం.
గతంలో ఎప్పుడు లేని విధంగా తన ట్రైలర్ లీక్ అయ్యింది అంటూ.. అయినప్పటికీ పవర్ స్టార్ రేంజ్ తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నాడు. లీకైన 9 గంటల తరువాత రిలీజ్ చేయగా గంటలోనే 2 లక్షల వ్యూవ్స్ వచ్చాయని ట్వీట్ చేసిన వర్మ జై ప్రవన్ కళ్యాణ్ అని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం 3.5లక్షల వ్యూవ్స్ తో దూసుకుపోతోందని పవర్ స్టార్ రాకింగ్ అని మరో ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీసిన ఈ మూవీపై విమర్శలు ఎన్ని వస్తున్నా కూడా వర్మ డోస్ తగ్గించడం లేదు. సెన్సార్ తో పని లేదు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని తన ఓటీటీ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆర్జీవి వరల్డ్ వెబ్ సైట్ కి క్రేజ్ పెంచడానికి పవర్ స్టార్ క్రేజ్ ని ఇన్ డైరెక్ట్ గా గట్టిగానే వాడుకుంటున్నాడు.
అభిమానుల పవర్ ఇంతేనా అంటూ అప్పుడప్పుడు అన్ లైక్స్ కూడా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. గడ్డి తింటావా సాంగ్ క్లిక్కవ్వడంతో పవర్ స్టార్ సినిమాపై క్రేజ్ పెరిగిందని వర్మ గట్టిగా నమ్ముతున్నాడు. ఇక ట్రైలర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వర్మ తన ఆర్జీవి వరల్డ్ లో సినిమాను రిలీజ్ చేసి ఏ స్థాయిలో లాభాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











