twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్‌లో లెస్పియన్స్.. కొట్టుకొని చచ్చారు.. వర్మ డేంజరస్‌గా సరికొత్త వివాదం

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండటమనే విషయంపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకొనే కథలు, తీసే సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటమే అందుకు కారణమనేది అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆయన తీసిన రెండు చిత్రాలు కోర్టుల్లో ఉండగా, మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజాగా వర్మ రిలీజ్ చేసిన డేంజరస్ సినిమా ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ చిత్ర కథ గురించి వర్మ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే..

    అమృత జీవితంపై మూవీ

    అమృత జీవితంపై మూవీ

    తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్‌ల ప్రేమ గాథ, పరువు హత్య నేపథ్యంగా రూపొందించిన చిత్ర రిలీజ్‌పై కోర్టు ఆదేశాలు ఉన్నాయి. బాధితురాలు అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా అడ్డుకొన్నారు. దాంతో ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది.

     దిశ ఎన్‌కౌంటర్‌పై వివాదం

    దిశ ఎన్‌కౌంటర్‌పై వివాదం

    ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్, ఎన్‌కౌంటర్ ఆధారంగా దిశ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన కనిపించింది. తన కూతురు జీవిత కథపై సినిమాను రూపొందించడంపై దిశ తండ్రి కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా రిలీజ్‌పై, చిత్రాన్ని రూపొందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

    తొలి లెస్పిబియన్ సినిమా అంటూ

    తొలి లెస్పిబియన్ సినిమా అంటూ

    దిశ, అమృత చిత్రాల పరిస్థితి ఇలా ఉండగానే, రాంగోపాల్ వర్మ స్వజాతి సంపర్కంపై తొలి లెస్పియన్ సినిమా అంటూ డేంజరస్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సినిమా పోస్టర్లు ఇప్పుడు నెటిజన్లు, సినిమా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశమయ్యాయి.

    Recommended Video

    #HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR
     పోలీసులు, గ్యాంగస్టర్స్

    పోలీసులు, గ్యాంగస్టర్స్

    `బ్యూటీపుల్' హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్' బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో డేంజ‌ర‌స్‌ అనే మూవీని తెరకెక్కించారు. రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ ఫిల్మ్., ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసింది. వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారు అని పోస్టర్‌పై వర్మ తెలిపారు.

    English summary
    RGV's India’s first lesbian crime/action film DANGEROUS promotional pictures goes viral. This films poster released by RGV through his twitter. He said its first Indian first lesbian film. Many criminals, Dons are in this relationship.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X