For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్మ ఒక్క స్టేట్మెంట్‌తో కోటి రూపాయల నష్టం..నిజాన్ని బయటపెట్టిన ఐస్ క్రీమ్ నిర్మాత

  |

  ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఫ్లాప్ సినిమాలకు, వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు కానీ వర్మ పేరు వింటే ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాల గురించి, హై టెక్నికల్ వాల్యూస్ తో కూడిన ట్రెండ్ సెట్టర్ సినిమాలు గురించి చెప్పేవారు.. అలా ఆయన చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో ఒకటి ఐస్ క్రీమ్. ఫ్లో కామ్ టెక్నాలజీ అంటూ 'ఐస్ క్రీమ్' అనే సినిమాని తీసిన ఆయన థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకొక పోయినా చేసిన నిర్మాతకు మాత్రం కాసులు కురిపించాడు. అయితే తనకు మాత్రం వర్మ కోటి రూపాయల నష్టం మిగిల్చారు అని ఆ నిర్మాత అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  ఫియర్ ఈజ్ హాట్

  ఫియర్ ఈజ్ హాట్

  'ఫియర్ ఈజ్ హాట్' అనే క్యాప్షన్‌తో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'ఐస్ క్రీమ్' సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నవదీప్-తేజస్వి జంటగా ‘కమింగ్ టు బర్న్ యూ' అంటూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని ‘భీమవరం టాకీస్' పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. 2014 12న విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా కలెక్షన్లు మాత్రం రాబట్టింది.

  రెమ్యునరేషన్ లేదు కానీ

  రెమ్యునరేషన్ లేదు కానీ

  నిజానికి ఈ సినిమా అప్పట్లో అనేక సంచలన రికార్డు సృష్టించింది. దానికి కారణం ఈ సినిమాకు పనిచేసిన హీరో మొదలు హీరోయిన్ దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ ఎవరు ముందుగా రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా పూర్తయి హిట్ గా నిలిస్తే అప్పుడు లాభాల్లో వాటాలు ఇస్తామని నిర్మాత అందరి దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు.. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఇలా సినిమా చేయడం ఇదే మొదటిసారి ఏమో... ఇక ఈ సినిమాకు మంచి లాభాలు రావడంతో తర్వాత నిర్మాత దర్శకుడు హీరో హీరోయిన్లు ఇతర నటీనటులు టెక్నీషియన్స్ అందరికీ చెప్పినట్టుగానే న్యాయం చేశారు.

  వర్మ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల

  వర్మ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల

  అయితే ఈ సినిమా విషయంలో వర్మ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల తాను కోటి రూపాయలు నష్టపోయానని ఈ నిర్మాత తాజాగా చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా అప్పట్లో జెమినీ టీవీ వాళ్లు శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు అట.

  అంత పెట్టి ఎందుకు కొనాలి?

  అంత పెట్టి ఎందుకు కొనాలి?

  అయితే సినిమా ప్రమోషన్ సమయంలో వర్మ మాట్లాడుతూ కేవలం రెండున్నర లక్షల రూపాయలతో ఈ సినిమా తీశాము అంటూ ఒక కామెంట్ చేశాడని ఆ కామెంట్ తో సినిమా కి కోటి రూపాయలు నష్టం చేకూరిందని రామ సత్యనారాయణ చెప్పుకొచ్చాడు. జెమిని వాళ్ళు రెండున్నర లక్షల రూపాయల సినిమాని మేము కోటి రూపాయలు పెట్టి ఎందుకు కొనాలి అంటూ వాళ్ళు కొనలేదని చెప్పుకొచ్చాడు.

  Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?
  ఆ హెడ్లైన్స్ కొంప ముంచాయి

  ఆ హెడ్లైన్స్ కొంప ముంచాయి

  అయితే అసలు విషయం వర్మ తర్వాత చెప్పినా సరే హెడ్లైన్స్ మాత్రం అలాగే ఉంచేశారని ఆ హెడ్లైన్స్ తమ కొంపముంచాయని ఆయన ని చెప్పుకొచ్చాడు. వర్మ మాట్లాడుతూ ముందుగా రెండున్నర లక్షల రూపాయల అమౌంట్ తో సినిమా స్టార్ట్ చేశామని సినిమా పూర్తయిన తర్వాత అందరికీ అయిన పేమెంట్ చేశాడని ప్రెస్ మీట్ లో చెప్పాడని అన్నారు.

  ఆ తర్వాత పేమెంట్ చేసిన విషయాన్ని పట్టించుకోకుండా రెండున్నర లక్షల రూపాయలతో సినిమా మొదలు పెట్టిన విషయాన్ని హైలెట్ చేయడంతో నష్టపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక తుమ్మలపల్లి రామసత్యనారాయణ తక్కువ సమయంలో ఎక్కువ చిన్న సినిమాలు ఎక్కువగా చేసి ఇండస్ట్రీ వర్గాల్లో పేరు తెచ్చుకున్నారు.

  English summary
  Director Ram Gopal Varma who is renowned for his eccentric work made an experiment of minuscule budget named ‘Ice cream’. Director disclosed the cost involved in making the movie accounts to only Rs.2, 11,832 at success celebrations. But this statement made producer to loose one crore. Producer Tummalapalli ramasatyanarayana clarifies in his latest interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X