RGV బ్యాడ్ బాయ్స్‌కు బ్యాడ్ న్యూస్.. వ్యూహం మూవీకి సెన్సార్ లైన్ క్లియర్.. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఆర్జీవి
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రం రిలీజ్‌కు సెన్సార్ మోక్షం లభించింది. గత కొద్ది రోజులుగా సెన్సార్ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాను 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఆర్జీవి ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ సినిమా రిలీజ్ వివరాల్లోకి వెళితే..
ఆర్జీవి డెన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్జీవి దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ వ్యూహం సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వైఎస్ జగన్‌గా అజ్మల్ వైఎస్ భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్‌గా మనీష్ ఠాకూర్ వ్యవహరిస్తున్నారు.

వాస్తవానికి రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న వ్యూహం సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా మొదటి భాగాన్ని నవంబర్ 10వ తేదీన, రెండో భాగం శపథం సినిమాను జనవరి 25వ తేదీన రిలీజ్ చేయాలని ప్రకటించారు. అయితే ఈ మూవీపై టీడీపీ వర్గాలు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.

వ్యూహం సినిమాకు సెన్సార్ కొన్ని అభ్యంతరాలు వ్కక్తం చేయడంతో వాటికి వివరణ ఇవ్వలేకపోవడంతో రివిజన్ బోర్డుకు సిఫారసు చేశారు. దాంతో ఈ సినిమా అనుకొన్న డేట్స్‌కు రిలీజ్ కాలేక వాయిదా పడింది. చివరకు సెన్సార్ బోర్డుతో పోరాటం చేసిన యూనిట్ సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్‌ను సాధించింది.

వ్యూహం సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ కావడంతో రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. నా సినిమాను ఆపాలని ప్రయత్నించిన బ్యాడ్ గయ్స్‌కు బ్యాడ్ న్యూస్. ఇదిగో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్. డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అని ట్వీట్ చేశారు. సెన్సార్ సర్టిఫికెట్‌ను చూపిస్తూ ఓ ఫోటోను పోస్టు చేశారు.


Click it and Unblock the Notifications











