బీహార్ డీజీపికి షాకిచ్చిన రియా చక్రవర్తి.. నా అర్హత అదే అంటూ ఎదురుదాడి

సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తనను తాను రక్షించుకొనేందుకు ఎదురు దాడిని ప్రారంభించారు. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాటల దాడికి పదును పెట్టారు. ఏకంగా బీహార్ డీజీపీ పాండేనే టార్గెట్ చేసినట్టు కనిపించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేయగా.. రియా వాటిని తప్పుపట్టారు. ఆ క్రమంలో బీహార్ సీఎం తప్పుపట్టే అర్హత రియాకు ఉందా అంటూ బీహార్ డీజీపీ ఘాటుగా స్పందించారు.

తాజాగా బీహార్ డీజీపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన పేరు చెప్పకుండానే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సుశాంత్‌ సింగ్‌ను ప్రేమించే ఏ వ్యక్తికైనా ఆ హక్కు ఉంటుంది. ఆ హక్కు తనకు ఉంది అంటూ రియా చక్రవర్తి వ్యాఖ్యలు చేసింది.

Rhea Chakraborty counter to Bihar DGP Gupteshwar Pandey Aukat comment

నన్ను విష కన్య అని ఒకరు.. నేను మంత్రాలు చేపించారని మరికొందరు ఇలా నాపై మాటల దాడి చేయడంపై రియా ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక రుగ్మతతో బాధపడే ఓ వ్యక్తి బాధను అర్థం చేసుకొని, ఆయన చికిత్స కోసం కష్టపడటమే నేను చేసిన నేరమా? అంటూ ప్రశ్నించారు.

సుశాంత్‌తో సహ జీవనం చేసిన రియాపై ఆయన మరణం తర్వాత ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 8వ తేదీన రియా గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత సుశాంత్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సుశాంత్ మరణానికి కారణం రియానే అంటూ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీడియాతో తన భావాలను రియా పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X