మరో రెండు తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రియా చక్రవర్తి
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ సూసైడ్ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా అతని అభిమానులు మరచిపోలేకపోతున్నారు. కొంతమంది సినీ తారలు కూడా ఇంకా సుశాంత్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సుశాంత్ మరణించిన తరువాత అతని గర్ల్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి అనేక రకాల కేసులతో సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
సుశాంత్ మరణం తరువాత రియాకు బెదిరింపులతో కూడా సందేశాలు వచ్చాయి. రియా చక్రవర్తి తన సోదరుడి కారణంగా కూడా డ్రగ్స్ వివాదంతో సతమతమైన విషయం తెలిసిందే. ఇక జైలు జీవితం అనంతరం చాలా రోజుల పాటు ఒంటరిగా సమయాన్ని గడిపిన ఆమె మళ్ళీ తన రెగ్యులర్ కెరీర్ తో బిజీగా మారనున్నట్లు తెలుస్తోంది. రియా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటిలానే బిజీ అవ్వాలని అనుకుంటోంది.

ఇటీవల ముంబైలోని ఒక జిమ్ బయట కనిపించింది. జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ పై శ్రద్ధ తీసుకుంటోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ బ్యూటీ ఇటీవల రెండు తెలుగు ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది నిర్మాతలు ఆమెను ప్రత్యేకంగా కలిసి డేట్స్ విషయంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఆల్ మోస్ట్ డీల్ సెట్టయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వనుందట. ఇక తెలుగులో ఇప్పటికే ఆమె సూపర్ మచ్చి అనే సినిమా చేసింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఆ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











