ఫైట్‌లోనే అలాంటి ఘటన.. ఆ ‘గుహ’లోనే సుశాంత్‌కు అనారోగ్యం.. రియా చక్రవర్తి నోట షాకింగ్‌గా!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తనపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. జాతీయ ఛానెల్ ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాలను బయటపెట్టారు. సుశాంత్ శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ..

సుశాంత్ సింగ్ డబ్బు దుర్వినియోగం చేయలేదు

సుశాంత్ సింగ్ డబ్బు దుర్వినియోగం చేయలేదు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డబ్బును దుర్వినియోగం చేసినట్టు వస్తున్న ఆరోపణలపై రియా చక్రవర్తి స్పందించారు. సుశాంత్ సింగ్ మాదిరిగానే తనకు మొదటి నుంచి విలాసవంతంగా జీవించడం అలవాటు. సుశాంత్ డబ్బుతో నేను ఎలాంటి విలాసాలకు పాల్పడలేదు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. యూరప్ ట్రిప్‌కు వెళ్లిన సమయంలో సుశాంత్‌కు డిప్రెషన్ అనే విషయం తెలిసింది అని రియా చక్రవర్తి చెప్పారు.

యూరప్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు

యూరప్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు


అక్టోబర్ 2019లో సుశాంత్‌తో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లాను. ఆ సమయంలోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు నాకు తెలిసింది. ఫైట్‌లోనే క్లాస్ట్రోఫోబిక్ (ఇరుకు, చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఉండేదుకు భయపడటం, ఆకాశంలో ప్రయాణించడం) లక్షణాలతో బాధపడ్డారు. అప్పుడు ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా మోడాఫినిల్ అనే మెడిసిన్ తీసుకొన్నారు. పారిస్ వెళ్లిన తర్వాత మూడు రోజుల వరకు రూమ్ నుంచి బయటకు రాలేదు అని రియా చక్రవర్తి తెలిపారు.

పారిస్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా

పారిస్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా

పారిస్ ట్రిప్‌కు వెళ్లడానికి ముందు చాలా అసౌకర్యంగా కనిపించారు. ఏదో ఒక రుగ్మతతో బాధపడుతున్నట్టు అర్ధమైంది. పారిస్‌కు వెళ్లిన తర్వాత సుశాంత్ ఉత్సాహంగా కనిపించారు. వీధుల్లో ఉల్లాసంగా గంతులు వేస్తూ కనిపించారు. ఆ సమయంలో వారు చాలా హ్యాప్పీగా ఉన్నారు. ఆయన చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అని రియా చెప్పారు.

ఇటలీలో గుహ లాంటి గదిలో ఉంటే

ఇటలీలో గుహ లాంటి గదిలో ఉంటే


యూరప్ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్‌కు వెళ్లాం. అక్కడి వరకు బాగానే ఉత్సాహంగా ఉన్నారు. ఇటలీలోకి వెళ్లిన తర్వాత గోతిక్ హోటల్‌లో బస చేశాం. అక్కడ మేము ఉన్న రూమ్‌ ఓ గుహ మాదిరిగా ఉండేది. అయితే అందులో ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. వేరే హోటల్‌కు మారుదామని చెప్పాను. కానీ తాను ఒప్పుకోలేదు. అప్పుడే అతడికి పీడకలలు రావడం మొదలయ్యాయి. అప్పుడే ఆరోగ్యం క్షీణించింది. మానసిక సమస్యలు మరింత పెరిగిపోయాయి అని రియా చక్రవర్తి వెల్లడించారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
2013 నుంచే డిప్రెషన్ అని

2013 నుంచే డిప్రెషన్ అని


యూరప్ పర్యటనలోనే సుశాంత్‌ను అడిగితే.. 2013 నుంచి డిప్రెషన్ గురవుతున్నట్టు చెప్పారు. హరేష్ శెట్టి అనే సైక్రియాటిస్ట్ వద్దకు వెళ్లినట్టు చెప్పారు. అతడే మోడాఫినిల్ మెడిసిన్ తీసుకోమని చెప్పినట్టు తెలిపారు. యూరప్ పర్యటనలో ఆరోగ్యం క్షీణించడంతో మధ్యలోనే ముంబైకి తిరిగి వచ్చాం అని రియా చక్రవర్తి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X