twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ నిర్మాతకు రియా చక్రవర్తి చుక్కలు.. మెగా అల్లుడి సినిమా నుంచి అవుట్!

    |

    దేశవ్యాప్తంగా సినిమా రంగంతో సంబంధం లేని వారికి కూడా ఇప్పుడు రియా చక్రవర్తి పేరు తెలిసి పోయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగా, ఆయన హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తిగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్‌తో మరింతగా వార్తల్లోని వ్యక్తిగా మారిపోయింది. అయితే ఆమె కెరీర్ టాలీవుడ్ నుంచే మొదలైందనే విషయం అతి తక్కువ మందికి తెలుసు. అలాగే తన కెరీర్‌లో అత్యంత వివాదంగా మారిన సమయంలో కూడా టాలీవుడ్‌ సినిమా సూపర్ మచ్చి చేస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమా నుంచి నిర్మాతలు తప్పించడం మరింత సంచనలంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    తూనీగ తూనీగ సినిమాతో రియా చక్రవర్తి కెరీర్

    తూనీగ తూనీగ సినిమాతో రియా చక్రవర్తి కెరీర్

    రియా చక్రవర్తి కెరీర్ విషయానికి వస్తే.. తన మొదటి సినిమా తెలుగులోనే చేసింది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు, మాగంటి రామచంద్రన్ రూపొందించిన తూనీగ తూనీగ సినిమాతో టాలీవుడ్‌లోకి రియా చక్రవర్తి అడుగుపెట్టారు. ఆ తర్వాత టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు.

    కల్యాణ్ దేవ్ సూపర్ మచిలో రియా చక్రవర్తి

    కల్యాణ్ దేవ్ సూపర్ మచిలో రియా చక్రవర్తి

    తూనీగ తూనీగ చిత్రంలో నటించిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచ్చి చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి నిర్మాత రిజ్వాన్, ఖుషి నిర్మాతలు. పులి వాసు దర్శకుడు. ఈ చిత్రంలో కన్నడ నటి రచితా రామ్ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్‌గా రియా చక్రవర్తి నటించారు.

    రియా చక్రవర్తితో తలనొప్పులు రావడంతో

    రియా చక్రవర్తితో తలనొప్పులు రావడంతో

    సూపర్ మచ్చి కోసం మార్చి నెలకు ముందు రియా చక్రవర్తి, కల్యాణ్ దేవ్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత షూటింగ్ వాయిదా పడటంతో డేట్స్ విషయంలో రియా చక్రవర్తి పేచి పెట్టినట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకు 70 నుంచి 80 రోజుల కాల్షిట్ ఇచ్చానని, ఆ డేట్స్ కూడా ఫినీష్ అయ్యాయంటూ వాదించినట్టు సమాచారం.

    ఇద్దరు బడా హీరోలు, అగ్ర నిర్మాత రంగంలోకి

    ఇద్దరు బడా హీరోలు, అగ్ర నిర్మాత రంగంలోకి

    అయితే రియా చక్రవర్తి డేట్స్ అయిపోయాయి.. షూటింగ్ వచ్చేది లేదంటూ తెగేసి చెప్పడంతో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు, ఓ బడా నిర్మాత రంగంలోకి దిగి సినిమా షూటింగ్‌కు హాజరయ్యేలా ఆమెకు నచ్చచెప్పినట్టు సమాచారం. అయితే లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో రెండు నెలల తర్వాత షూటింగ్‌కు వస్తానని చెప్పి.. ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయారట.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    చివరకు రియాను తప్పించిన నిర్మాతలు

    చివరకు రియాను తప్పించిన నిర్మాతలు

    రియా చక్రవర్తి తీరుతో విసుగు చెందిన సూపర్ మచ్చి నిర్మాతలు రియా చక్రవర్తిని తప్పించారు. ఆమెతో చేసిన కొన్ని రోజుల షూటింగు రషెస్‌ను పక్కన పెట్టేసి మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ మరణించడం, ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకొన్నట్టు తెలిసింది.

    English summary
    After Tuneega Tuneega movie, Rhea Chakraborty re entered into tollywood. Rhea signed a movie with Kalyan Dev for Super Machi. Reports suggest that After lot of complications, Rhea was saked from the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X