హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా రిచి గాడి పెళ్లి ఫస్ట్ లుక్
కేఎస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా కేఎస్ హేమరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న రిచి గాడి పెళ్లి" చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రనటీనటుల, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేశ్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రిచి గాడి పెళ్లి పేరుతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న దర్శకుడు హేమరాజ్ మాట్లాడుతూ... జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావ వ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో రాణిస్తున్న సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళగనాథ్ ఇతర టెక్నీషియన్ల సహాకారంతో చిత్రాన్ని ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాం అని అన్నారు.

నటీనటులు: నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సత్య, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా తదితరులు
నిర్మాత, బ్యానర్: కేఎస్ ఫిల్మ్ వర్క్స్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కెఎస్ హేమరాజ్
సినిమాటోగ్రఫి: విజయ్ ఉళఘనాథ్
సంగీతం: సత్యన్
ఎడిటర్: అరుణ్ ఈఎం
కథ: రాజేంద్ర వైట్ల, నాగరాజు మడూరి
సాహిత్యం: అనంత శ్రీరామ్, శ్రీ మణి
సంభాషణలు: రాజేంద్ర వైట్ల
కళ: హరివర్మ
కొరియోగ్రాఫర్: సతీష్ శెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు
మేకప్: అంజలి సంఘ్వీ
కార్య నిర్వాహక నిర్మాతలు: రామ్ మహంద్ర & శ్రీ
సహ నిర్మాత: సూర్య మెహర్
పిఆర్వో: మధు వీ ఆర్


Click it and Unblock the Notifications











