కుర్ర హీరోయిన్‌తో ప్రభాస్ రొమాన్స్.. రాధే శ్యామ్‌లో అలా.. ఇందులోనేమో ఇలా!
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసి.. స్టార్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే భాగం అవుతూ వస్తున్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఇప్పటికే ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే మూవీలను లైన్‌లో పెట్టుకున్నాడు.
చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్‌తో రాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ సినిమా షూట్ ప్రారంభోత్సవం, ఫస్ట్ షెడ్యూల్ గురించి కూడా ఎంతో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీ జరిగాయని తెలిసింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ పాత్రల కోసం హాట్ బ్యూటీలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ను ఎంపిక చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మూడో హీరోయిన్‌ను కూడా సెలెక్ట్ చేశారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రోల్‌ను కుర్ర హీరోయిన్ రిధి కుమార్ చేస్తోందట. ఇప్పటికే ఈమెతో చిత్ర యూనిట్ చర్చలు కూడా జరిపిందని టాక్. గతంలో 'రాధే శ్యామ్' మూవీలో చిన్న పాత్ర చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌కు జోడీగా నటిస్తోందని సమాచారం.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











