RIP మాధవీలత అంటూ శ్రీ రెడ్డి సెన్సేషన్.. ఇష్యూ ఎక్కడిదాకా పోయిందంటే!

త్వరలోనే తాను చచ్చిపోతా అంటూ యంగ్ హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ జనాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మాధవీలత త్వరలోనే చచ్చిపోతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ ఇష్యూలోకి ఎంటరైన శ్రీ రెడ్డి సంచలన కామెంట్ చేయడం మరింత రచ్చగా మారింది. వివరాల్లోకి పోతే..

రేవతిలా చచ్చిపోతా అనేసిన మాధవీలత

రేవతిలా చచ్చిపోతా అనేసిన మాధవీలత

ఇటీవలే మాధవీలత తన ఫేస్‌బుక్‌లో ''ఐ హేట్ మై హెల్త్ ఇష్యూస్ అంటూ మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నానని.. రోజూ ట్యాబ్లేట్స్ వేసుకోవాల్సి వస్తుందని, ఇంతలా మందులు వాడుతూ పోతే ఏదో ఒకరోజు అవి పనిచేయక ‘ప్రేమ' సినిమాలో రేవతిలా చచ్చిపోతానేమో'' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్‌ వేరేలా అర్థం చేసుకొని పలు వార్తలు గుప్పుమన్నాయి.

పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు

పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు

దీంతో పరిస్థితి గమనించిన మాధవీలత మరోసారి రియాక్ట్ అయింది. ''నేను చచ్చిపోవడం లేదు. నాకు చచ్చిపోయేటంత జబ్బేం లేదు. ఏదో క్యాజువల్ పోస్ట్ పెడితే నేను చచ్చిపోతానని స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారు. మెసేజ్‌లు పెడుతున్నారు.. నా చావు మీద నేను వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు'' అంటూ అని పేర్కొంది.

శ్రీ రెడ్డి సంచలన కామెంట్.. రంగంలోకి మాధవీలత సపోర్టర్స్

శ్రీ రెడ్డి సంచలన కామెంట్.. రంగంలోకి మాధవీలత సపోర్టర్స్

అయితే ఈ ఇష్యూలో ఎంటరైన తాజాగా శ్రీ రెడ్డి సంచలన కామెంట్ కామెంట్ చేసింది. తనదైన కోణంలో ఆమెను ఉద్దేశిస్తూ ‘RIP మాధవీలత.. హో సారీ.. ఇంకా పోలేదా?' అంటూ ఫేస్‌బుక్‌ బాణం వదిలింది. దీంతో మాధవీలత చావు ఇష్యూ మరింత రచ్చకెక్కింది. ఆమె సంగతేమో గానీ నువ్వీ పోవచ్చుకదా.. దరిద్రం పోతుంది అంటూ మాధవీలత సపోర్టర్స్ రంగంలోకి దిగారు.

అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం.. మాధవీలత తీరు

అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం.. మాధవీలత తీరు

అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా నిలిచింది మాధవీలత. దీంతో టైం చూసుకుని ఆమెపై శ్రీరెడ్డి ప్రతాపం చూపుతోంది. ఇప్పుడిలా చావు వార్తపై స్పందించి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

 మాటల యుద్ధం.. అర్థనగ్న ప్రదర్శన

మాటల యుద్ధం.. అర్థనగ్న ప్రదర్శన

గతంలోనూ శ్రీ రెడ్డి- మాధవీలత మధ్య చాలాసార్లు మాటల యుద్ధం జరిగింది. ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి చేసిన అర్థనగ్న ప్రదర్శనను కూడా మాధవీలత వ్యతిరేఖించింది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి శ్రీరెడ్డి.. మాధవీలతను టార్గెట్ చేస్తూనే ఉంది.

 RIP Maadhavi Latha: Sri Reddy Shocking comments

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X