Rishab Shetty On Peddi: పెద్ది ట్రైలర్‌పై కాంతార హీరో రివ్యూ.. రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సినీ ప్రముఖుల నుంచి మాత్రం మంచి స్పందన వస్తుండటం విశేషం. ముఖ్యంగా 'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి ఈ ట్రైలర్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Also Read
వాడిలో 1% డెడికేషన్ ఉన్నా చాలు.. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని - బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
వాడిలో 1% డెడికేషన్ ఉన్నా చాలు.. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని - బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ భాషల నటినటులను ఎంపిక చేయడం ద్వారా రేంజ్‌ను పెంచే ప్రయత్నం జరిగింది. సాంకేతికంగా కూడా సినిమా స్టాండర్డ్స్‌లో ప్రదర్శించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రాఫర్ R. రత్నవేలు విజువల్స్ సినిమాకు ప్రధాన లైట్‌గా నిలిచాయి.

Recommended For You
సుడిగాలి సుధీర్ మరో కొత్త సినిమా .. ఆ బిగ్‌బాస్ బ్యూటీ హీరోయిన్‌గా..
సుడిగాలి సుధీర్ మరో కొత్త సినిమా .. ఆ బిగ్‌బాస్ బ్యూటీ హీరోయిన్‌గా..
Rishab Shetty Praises Peddi Trailer Calls Ram Charan Absolute Fire Performance

ఇక కథ పరంగా చూస్తే.. విజయనగరం స్థాపించిన ఓ యువకుడు తన గ్రామ ప్రజల కోసం ఎలా పోరాడాడు? స్పోర్ట్స్‌ను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని ఎలా ఏకం చేశాడు? అన్నదే సినిమా మెయిన్ కాన్సెప్ట్‌గా. మాస్, ఎమోషన్, స్పోర్ట్స్-అన్నీ కలిసి ఈ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడ్డాయి.

You May Also Like
Peddi: నార్త్ అమెరికాలో పెద్ది ఊచకోత.. రిలీజ్‌కు ముందే నయా రికార్డు..
Peddi: నార్త్ అమెరికాలో పెద్ది ఊచకోత.. రిలీజ్‌కు ముందే నయా రికార్డు..

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే కథలో రామ్ చరణ్ ఓ క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, అలాగే రన్నర్‌గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "పెద్ది గుడిలో దేవుడు కాదు... నేలలో దేవుడు" వంటి డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర స్లాలో చరణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాకు రియలిస్టిక్ ఫీల్డ్ తీసుకొచ్చింది.

నేనేం ఒంటరివాడిని కాదు.. ఆ పోస్ట్ పై సల్మాన్ ఖాన్ క్లారిటీ
నేనేం ఒంటరివాడిని కాదు.. ఆ పోస్ట్ పై సల్మాన్ ఖాన్ క్లారిటీ

ట్రైలర్‌లో చూపించిన స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ కోర్ కూడా చాలా బలంగా ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా చివరి భాగంలో చరణ్ గాయంతో కుంటుకుంటూ కనిపించే సన్నివేశం, సినిమాలో 'పారా అథ్లెట్' ట్రాక్ ఉండొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఇది క్లైమాక్స్‌పై ఆసక్తిని పెంచుతోంది. బుచ్చిబాబు ముందుగానే చెప్పినట్లుగా, చివరి 50 నిమిషాలు భావోద్వేగంగా ఉంటాయని ట్రైలర్ హింట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పెద్ది ట్రైలర్ పై పలువురు సినీ సెలబ్రెటీలు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

'బుచ్చిబాబు పైకి అమాయకంగా కనిపిస్తాడు. కానీ, నాతో అలాంటి పనులు చేయించాడు'
'బుచ్చిబాబు పైకి అమాయకంగా కనిపిస్తాడు. కానీ, నాతో అలాంటి పనులు చేయించాడు'

ఇక కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, "రామ్ చరణ్ ప్రతి ఫ్రేమ్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా 'అబ్సల్యూట్ ఫైర్'లా ఉంది" అంటూ కొనియాడారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న శివ రాజ్‌కుమార్ గురించి, "శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకుర్చింది" అని పేర్కొన్నారు. హీరోయిన్ జాన్వి కపూర్ పాత్ర గురించి కూడా చాలా బాగుంది, "జాన్వీ ఈ సినిమాలో అందంగా, వైబ్రెంట్‌గా కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది" అని అన్నారు.

Karuppu Day 5 Collection: జోరు తగ్గని కరుప్పు.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్?
Karuppu Day 5 Collection: జోరు తగ్గని కరుప్పు.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్?

ఇక దర్శకుడు బుచ్చి బాబు సనా పనిపై ప్రశంసలు కురిపిస్తూ, "ఎక్సలెంట్ వర్క్" అంటూ అభినందించారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు సహా నిర్మాతలు, నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్‌తో 'పెద్ది' సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ట్రైలర్‌తో మంచి హైప్ సృష్టించిన ఈ సినిమా, సెలబ్రిటీల ప్రశంసలతో మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more about: peddi ram charan rishab shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X