Kantara Telugu Trailer Review నీలో ఆవేశం శత్రువు కాకూడదు.. మరో సంచలనానికి కంతారా రెడీ

కేజీఎఫ్ లాంటి సంచలన చిత్రాన్ని అందించిన హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రం కంతారా. కన్నడలో సెప్టెంబర్ 30న రిలీజై భారీ విజయాన్ని అందుకొన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను అక్టోబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి, హీరోయిన్ సప్తమీ గౌడ, అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..

18వ శతాబ్దంలో జరిగిన సంఘటనతో

18వ శతాబ్దంలో జరిగిన సంఘటనతో

18వ శతాబ్దంలో ఒక రాయి కోసం ఓ రాజు తన రాజ్యంలోని విశాల భూభాగాన్ని గిరిజన తెగకు దానం ఇస్తారు. ఆ భూమిని కబలించాలని ప్రయత్నించిన రాజకీయ నేతలు, అటవీ అధికారులకు ఓ శక్తి ఊహించని షాక్ ఇస్తుంది. ఊరిలో కాయకష్టం చేసుకొనే శివను అటవీ అధికారులు టార్గెట్ చేస్తారు. అటవీ ప్రాంతంలో జీవించే గిరిజనుల నుంచి భూమిని లాక్కొనేందుకు ప్రయత్నిస్తారు. అయితే శివ వారి ఎత్తుగడలను ఎలా చిత్తు చేశాడనేది కంతారా సినిమా కథ.

 ఎమోషనల్ కంటెంట్‌తో

ఎమోషనల్ కంటెంట్‌తో


కంతారా సినిమాకు ఎమోషనల్ కంటెంట్ ఒక బలం కాగా.. దానికి తోడుగా సాంకేతిక విభాగాలు విజృంభించాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఈ సినిమాను చాలా రిచ్‌గా మార్చింది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నిర్మాణ విలువలు సినిమాను హై రేంజ్‌లో పెట్టాయి. మొత్తంగా కొత్త అనుభూతిని కలిగించే చిత్రంగా కంతారాను రూపొందించారు.

యాక్టింగ్, డైరెక్షన్‌తో రిషబ్ శెట్టి

యాక్టింగ్, డైరెక్షన్‌తో రిషబ్ శెట్టి


కంతారా సినిమాలో హీరో పాత్రను పోషించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలతో రిషబ్ శెట్టి తన ప్రతిభను చాటుకొన్నారు. హీరోయిన్‌గా సప్తమి గౌడ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. రిషబ్ శెట్టితో రొమాంటిక్ సన్నివేశాలను సప్తమి పండించింది. ఇక విలన్ షేడ్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కన్నడ కిషోర్ అద్బుతంగా నటించాడు. పలు పాత్రల్లో నటించిన వారు తమ నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తారు.

ఊపిరి బిగపట్టి చూశానని.. అల్లు అరవింద్

ఊపిరి బిగపట్టి చూశానని.. అల్లు అరవింద్


ఇండస్ట్రీలో చాలా విభిన్నమైన చిత్రాలను తీశాను. కానీ కంతారా సినిమా చూసిన తర్వాత వారి నుంచి ఎంతో కొంతైనా నేర్చుకోవాలనిపించింది. డిఫరెంట్ సినిమా కావాలంటే కంతారా చూడండి. డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో పుష్పను చూసి ఎంత ఇష్టపడ్డారో.. అంతే మొత్తంలో మీరు ఈ సినిమాను ఇష్టపడుతారు. విష్ణు తత్వాన్ని బ్యాక్ గ్రౌండ్‌గా ఈ సినిమాను తీశారు. ఈ సినిమా చివరి 40 నిమిషాలు ఊపిరి బిగపట్టి చూశాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అని అల్లు అరవింద్ అన్నారు.

తెర వెనుక, తెర ముందు


నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ తదితరులు
దర్శకత్వం: రిషబ్ శెట్టి
నిర్మాత: విజయ్ కిరగందూర్
బ్యానర్: హోంబలే ఫిలింస్
మ్యూజిక్: బీ అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫి: అరవింద్ ఎస్ కశ్యప్
ఎడిటర్: ప్రతీక్ శెట్టి, కేఎం ప్రకాశ్
రిలీజ్: 2022-10-15

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X