Rishab Shetty: కాంతార టీమ్‌తో రిషబ్ శెట్టికి విభేదాలు? రుక్మిణి వసంత్‌కి ఊహించని షాక్

తన ప్రతిభతో కన్నడ చిత్ర పరిశ్రమను మరో మెట్టు పైకి ఎక్కించారు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంతార, కాంతార చాప్టర్ 1 చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాయి. దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథ, కన్నడ సంస్కృతి, ఆచారాలను మేళవించి రిషబ్ శెట్టి కాంతార సిరీస్‌లను తెరకెక్కించారు. కాంతారను మించి కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు సంయుక్తంగా కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, నవీన్ డీ పడిల్, ప్రకాశ్ తుమినాడ్, బాలా రాజ్వాడీ తదితరులు నటించారు. గాంధీ జయంతి కానుకగా 2025 అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Rishab Shetty unfollows Rukmini Vasanth and Raj B Shetty and kantara production house

కేవలం 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో 622.48 కోట్ల రూపాయలు, 741.36 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 111 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలిపి వరల్డ్ వైడ్‌గా 852 కోట్ల రూపాయలు రాబట్టి 1000 కోట్ల రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. కర్ణాటకలో 252 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 223 కోట్ల రూపాయలు, ఆంధ్రా- తెలంగాణలలో 86 కోట్ల రూపాయలు, తమిళనాడులో 65 కోట్ల రూపాయలు, కేరళలో 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరొచ్చింది. రిషబ్ శెట్టి ఏకంగా కన్నడ సూపర్‌స్టార్‌గా ఎదిగారు.

కాగా... తనతో కలిసి పనిచేసిన వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడని రిషబ్ శెట్టికి ఇండస్ట్రీలో ఓ మచ్చ ఉంది. గతంలో రష్మిక మందన్నతో ఇలాగే గొడవలు పెట్టుకోగా.. ఆమె ఏకంగా కన్నడ ఇండస్ట్రీని వదిలేసి టాలీవుడ్‌లో అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఎదిగి, తెలుగింటి కోడలిగా మారింది. ఇప్పటికీ రిషబ్ - రష్మికల మధ్య వివాదం అలాగే ఉంది. తాజాగా కాంతార చిత్ర యూనిట్‌తోనూ రిషబ్‌కి విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎవ్వరూ రియాక్ట్ కాలేదు.

తాజాగా ఈ ఊహాగానాలను నిజం చేస్తూ రిషబ్ శెట్టి షాకిచ్చారు. కాంతార చాప్టర్ 1లో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వసంత్‌తో పాటు ఆ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాలను సోషల్ మీడియాలో రిషబ్ శెట్టి అన్‌ఫాలో చేశారు. వీరితో పాటు తన జీవితంలో అత్యంత కీలకమైన గరుడ గమన వృషభ వాహన మూవీలో తనతో కలిసి నటించిన రాజ్ జీ శెట్టిని కూడా ఆయన అన్ ఫాలో చేశారు. అయితే హోంబలే అధినేత విజయ్ కిరగందూర్‌ను మాత్రం రిషబ్ ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం రిషబ్ వ్యవహారం శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్‌తో రుక్మిణి వసంత్‌, బి శెట్టికి, హోంబలే ఫిల్మ్స్‌తో ఎలాంటి విభేదాలు ఉన్నాయి. ఆయన అలా ఎందుకు చేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

ఇక రిషబ్ శెట్టి సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ ప్రాజెక్ట్‌లో ఆయన నటిస్తున్నారు. ఇందులో హనుమంతునిగా రిషబ్ కనిపించనున్నారు. ఇటీవల హంపిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X