Kantara Chapter 1: ఫినిషింగ్‌లో కాంతార చాప్టర్ 1 క్రేజీ రికార్డ్... రిషబ్ శెట్టి సరికొత్త చరిత్ర!

కాంతారకు సీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కాంతార చాప్టర్ 1. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. విజయదశమి కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన కాంతార చాప్టర్ 1 విడుదలై సంచలన విజయం సాధించింది. ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది.

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు ఉన్న అంచనాల దృష్ట్యా భారీ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

Rishab Shetty s Kantara Chapter 1 completed 50 days journey

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు తొలిరోజున ప్రీమియర్స్‌తో కలిపి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు తొలి వారం ఇండియా వైడ్‌గా 403.25 కోట్ల రూపాయలు, రెండో వారం 176.5 కోట్ల రూపాయలు, మూడో వారంలో 93.1 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 44.75 కోట్ల రూపాయలు, ఐదో వారంలో 15.75 కోట్ల రూపాయలు, ఆరో వారంలో 5.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 621.22 కోట్ల రూపాయలు నెట్.. 740 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఏకంగా 111 కోట్ల రూపాయలు రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 851 కోట్ల రూపాయల భారీ వసూళ్లు వచ్చాయి.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ వివరాలు
కాంతార చాప్టర్ 1 .. కర్ణాటకలో 247.48 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 106.2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 72.56 కోట్ల రూపాయలు, కేరళలో 55.90 కోట్ల రూపాయలు, హిందీలో 257.36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో తొలివారం 63.55 కోట్ల రూపాయలు, రెండో వారంలో 18.15 కోట్ల రూపాయలు, మూడో వారంలో 5.7 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 2.2 కోట్ల రూపాయలు, ఐదో వారంలో 31 లక్షల రూపాయలు, ఆరో వారంలో 3 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది. ఈ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో కాంతార చాప్టర్ 1 పదమూడో స్థానంలో నిలిచింది. అలాగే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్ 31 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌‌లోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే హిందీలో నవంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కాంతార చాప్టర్ క్రేజీ రికార్డ్
కాగా.. కాంతార చాప్టర్ 1 వసూళ్లలో ప్రభంజనం సృష్టించగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుత రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన వారానికే వెళ్లిపోతుండగా.. కాంతార చాప్టర్ 1 మాత్రం క్రేజీ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: rishab shetty Kantara Chapter 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X