IPL 2024 ప్రీతి జింటాకు గుండె దడ పెంచిన రిషబ్ పంత్!

ఐపీఎల్ 2024 టోర్నీలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య రసవత్తరంగా జరిగిన ఉత్కంఠకు గురి చేసింది. ఇరు జట్ల మధ్య నువ్వా? నేనా అనే విధంగా మ్యాచ్ ఆద్యంతం సాగింది. కాసేపు విజయం రెండు జట్ల మధ్య దోబూచలాడేలా చేసింది. అయితే చివరి ఓవర్ వరకు మ్యాచ్ సాగడంతో పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతీ జింటా ఊపిరి బిగపట్టి చూస్తూ ఉండిపోయింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

టాస్ గెలిచి ఫీల్గింగ్ పంజాబ్ కింగ్స్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. దాంతో 175 పరుగలు విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు ఓ దశలో అంటే 16వ ఓవర్ వరకు 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఆ దశలో ప్రీతి జింటా ముఖంలో టెన్షన్ కనిపించింది.

Cricketer Rishabh panth increases Tension to Preity Zinta during the Punjab Kings Vs Delhi Capital Match

ఆ పరిస్థితుల్లో విజయ లక్ష్యం కష్టంగా మారే పరిస్థితుల్లో పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టోన్ చెలరేగిపోయాడు. లివింగ్ స్టోన్ ధాటిగా ఆడుతూ.. 17వ ఓవర్‌లో 2 ఫోర్లతో కలిసి 11 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఓవర్ అంటే 18 ఓవర్‌లో సామ్ కుర్రాన్ సిక్స్, ఫోర్, సిక్స్ సాధించి మొత్తం 18 పరుగులు రాబట్టారు. దాంతో రెండు ఓవర్లలో 10 పరుగులు చేసే విధంగా టార్గెట్ సులభంగా కనిపించింది.

19వ ఓవర్‌లో సామ్ అవుట్ కావడం, ఆ ఓవర్‌లో 1 పరుగులే రావడంతో మళ్లీ టెన్సన్ మొదలైంది. చివరి ఓవర్‌లో 6 బంతులకు ఆరు బంతులు కావాల్సి ఉండటంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ మొదలైంది. కానీ ఢిల్లీ బౌలర్ సుమిత్ కుమార్ వైడ్స్ వేయడం.. 20వ ఓవర్ 2 బంతికి లివింగ్ స్టోన్ సిక్సర్ కొట్టడంతో విజయం పంజాబ్‌ను వరించింది. అప్పటి వరకు టెన్షన్‌లో ఉన్న ప్రీతి జింటా ఎగిరి గంతేసింది. ముద్దుల వర్షం కురిపిస్తూ జట్టును ఎంకరేజ్ చేస్తూ కనిపించింది.

ఇదిలా ఉండగా, 2022 సంవత్సరంలో డిసెంబర్‌లో యాక్సిడెంట్ గురైన రిషబ్ పంత్ దాదాపు 435 రోజులు క్రికెట్ దూరంగా ఉండి.. ఐపీఎల్‌తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ కెప్టెన్స్‌గా, వికెట్ కిపర్‌గా చురుకుగా ఆడుతూ కనిపించాడు. స్టంప్పింగ్స్, క్యాచుల పడుతూ ఉత్సాహంగా కనిపించారు. పంజాబ్‌ను చివరి ఓవర్ వరకు ఆడేలా తన కెప్టెన్సీనికి పదును పెట్టి..తనలో పస తగ్గలేదని నిరూపించుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X