రష్మికకు ఆ హీరో చేతిలో ఘోర అవమానం.. ఆ పోస్టర్ వదిలి మరి, ఇంత దారుణంగానా
రష్మిక మందన్న.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సాధారణ హీరోయిన్ నుంచి ఇప్పుడు నేషనల్ క్రష్‌గా ఎదిగింది రష్మిక. బ్యాక్ టూ బ్యాక్ బడా చిత్రాలలో నటిస్తూ లక్కీ హ్యాండ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్‌తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ ముద్దుగుమ్మలనే వణికిస్తున్నారు. ఇప్పుడు రష్మిక డేట్స్ కోసం మేకర్స్ క్యూకడుతున్నారు. అలాంటి రష్మికకు ఘోర అవమానం జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే:
కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న .. చిన్నా చితకా పాత్రలలో నటిస్తూనే ఇప్పుడు ఈ స్థాయికి చేరారు. తన దృష్టి పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమపై పెట్టిన రష్మక మందన్న.. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు. తర్వాత బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఏకంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు.

ఇక గతేడాది సందీప్ రెడ్డి వంగా - రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్‌తో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా పుష్ప 2లో హీరోనే డామినేట్ చేసే నటనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలైన కుబేరతో పాటు హిందీలో చావా, సికిందర్, థమ, ది గర్ల్ ఫ్రెండ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రష్మిక మందన్న నటిస్తున్నారు.
రష్మిక కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా ఆమె జీవితంలో తొలి చిత్రం కిరిక్ పార్టీకి ప్రత్యేక స్థానముంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కిర్రాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే రష్మిక, రక్షిత్‌లు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకుని నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు తెలుగు నుంచి ఆఫర్లు పోటెత్తడంతో రష్మిక తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలతో రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
8 years ago today, #KirikParty became a turning point in my journey and my team’s. This film will always hold a special place in our hearts for the love it brought our way. Here’s to this beautiful film and the paths it opened for all of us! #8YearsOfKirikParty
— Rakshit Shetty (@rakshitshetty) December 30, 2024
రష్మిక పేరెత్తితే చాలు రక్షిత్ కంటే రిషభ్ మండిపడుతున్నాడు. కాంతార టైంలో రష్మికపై విరుచుకుపడ్డాడు కూడా. రక్షిత్‌కు దూరమైన రష్మిక.. టాలీవుడ్ స్టారో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా వీరు తమ బంధాన్ని బయటపెట్టనప్పటికీ జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలు తీసుకొస్తున్నాయి. తాజాగా కిరిక్ పార్టీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిషభ్ శెట్టి ఓ ట్వీట్ చేసి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు.
ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ,
— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024
ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.
ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.
8 years ago, a journey began that touched hearts and created countless memories.
Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz
ఇదే ఇప్పుడు సంచలనమైంది.. ఈ సినిమా హీరోయిన్ రష్మిక లేకుండానే ఓ పోస్టర్ వదిలాడు రిషబ్. వీరి మధ్య గొడవలు గట్టిగానే జరిగాయని అందుకే రష్మికను పట్టించుకోలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రక్షిత్ కూడా సింపుల్‌గా తన ట్వీట్ ముగించగా.. తన తొలి చిత్రం గురించి రష్మిక కనీసం స్పందించకపోవడం శాండిల్‌వుడ్‌లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











