టాలీవుడ్‌లోకి మరో నిర్మాణ సంస్థ.. రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 ప్రారంభం
తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో ప్రతిభావంతులైన నటీనటులు, నిర్మాతలు ఎంట్రీ ఇస్తున్నారు. రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ సాయిబాబా టెంపుల్‌లో గ్రాండ్‌గా జరిగింది. లక్ష్మణ్, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా డీ నాగ శశిధర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లా జమీందార్, భాగమతి చిత్రాల దర్శకుడు అశోక్, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తొలి సన్నివేశానికి రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ అశోక్ స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. అలాగే జీడీ డైరెక్టర్ విశ్వనాధ్ అరిగెల కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమా పెద్ద సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని అతిథులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు డీ నాగ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో తెలియజేస్తాం. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన డైరెక్టర్ అశోక్ గారికి, నిర్మాత రాజ్ కందుకూరి గారికి, జోడి డైరెక్టర్ విశ్వనాధ్ అరిగెల గారికి ధన్యవాదాలు. నూతన నటీనటులు చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. మా చిత్ర యూనిట్ అందరికి మీ సపోర్ట్ కావాలని తెలిపారు.
నటీనటులు: లక్ష్మణ్, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారథి, డి. నాగేందర్‌రెడ్డి
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు, విజయ భట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి


Click it and Unblock the Notifications











