మస్తాన్ సాయి కేసు.. ఆ ఇంట్లో రోజూ జరిగేది ఇదే... లావణ్య ఆడియో లీక్ చేసిన శేఖర్ భాషా
గతేడాది టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన లావణ్య వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. తర్వాత వీరి వ్యవహారం సద్దుమణగగా.. ఇటీవల మరోసారి లావణ్య బాంబు పేల్చింది. యువతులను ట్రాప్ చేసి వారి నగ్న ఫోటోలు, వీడియోలను చిత్రీకరించి ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడంటూ గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిపై ఈ నెల 3న హైదరాబాద్ నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది.
లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అతని హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 మంది అమ్మాయిల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన అదనపు ఎస్పీ .. ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు రావడం దుమారం రేపింది. ఆ వెంటనే టాలీవుడ్ హీరో నిఖిల్ పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపించడం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. సదరు పోలీస్ అధికారితో సన్నిహితంగా ఉన్న యువతి తనను ఆయన మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఈ విషయంలో సాయం చేస్తానని శేఖర్ భాషా పరిచయం చేసుకున్నాడంటూ అతనితో ఆమె ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో శేఖర్ భాషాను లేపేద్దామని లావణ్య స్నేహితురాలు పడాల లక్ష్మీ అనే యువతి చింటూ అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా రెక్కీ చేస్తే శేఖర్ భాషా 24 గంటల్లో దొరికిపోతాడని అతనిని కొట్టి కొట్టి పడేయాలని, మన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ చేయాలని ఆ ఆడియోలో పడాల లక్ష్మీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో శేఖర్ భాషా మీడియా ముందుకు వచ్చాడు. లక్ష్మీ పడాలకు - లావణ్యకు- చింటూకు జరిగిన సంభాషణ తాలుకా ఆడియో టేపును ఆయన లైవ్‌లో వినిపించారు. శేఖర్ భాషా వల్ల అందరూ నేను పెద్ద సెలబ్రెటీ అయిపోయానని పడాల లక్ష్మీ అందులో వ్యాఖ్యానించింది. సాయి 50 లక్షలు ఇస్తానని మోసం చేశాడని.. మనిద్దరం కలిసి వాడిని మోసం చేశామని లక్ష్మీ - లావణ్యలు మాట్లాడుకుంటారు. శేఖర్ భాషా మీద డిస్కస్ చేయడానికి ఇద్దరు అమ్మాయిలు కావాలని చింటూని లావణ్య అడుగుతుంది.
చాలా పకడ్బందీగా ఆ ఇంట్లో నాపై కుట్ర జరుగుతుందని శేఖర్ భాషా చెప్పాడు. లావణ్య దగ్గరే లక్ష్మీ పడాల ఉంటోందని , ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కూడా అక్కడే ఉంటున్నాడని ఆయన ఆరోపించాడు. వరలక్ష్మీ టిఫిన్స్ వ్యవహారంలో తప్పించుకోవడానికి మస్తాన్‌పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని శేఖర్ భాషా ఆరోపించాడు. మస్తాన్ ఏమీ దేవుడు కాడని.. ఎవరు ఫోన్ చేసినా వారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటానని శేఖర్ చెప్పాడు. వీళ్లందరికీ కావాల్సింది డబ్బేనని.. మస్తాన్ సాయి దగ్గర డబ్బులున్నాయని, అందుకే ట్రాప్ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజ్ తరుణ్ వదిలేసిన తర్వాత మెయింటైన్స్ కోసం కొన్నాళ్లు చింటూపై లావణ్య ఆధారపడిందని అతనితోనూ గొడవ అయిన తర్వాత మస్తాన్ సాయిని ట్రాప్ చేయడం మొదలుపెట్టిందని ఆరోపించాడు. 2023లో గుంటూరు పట్టాభిపురం పోలీసులకు మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసిందని ఆ ఎఫ్ఐఆర్ కాపీపై నిలదీస్తే మళ్లీ మాట మార్చేసిందని శేఖర్ గుర్తుచేశాడు. మస్తాన్ సాయి నుంచి ఎంతో కొంత వసూలు చేసిన తర్వాత మళ్లీ కొన్ని వీడియోలతో అతనిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిందని చెప్పాడు.
మస్తాన్ సాయి దగ్గర ఇన్ని వీడియోలు ఉంటే బ్లాక్ మెయిల్ చేయాల్సింది ఎవరు? మరి బాధితులు ఎవరు? ఒకవేళ కంప్లయింట్ చేస్తే ఎవరు చేయాలి మస్తాన్ సాయి చేయాలి? కానీ మస్తాన్ సాయి గర్ల్‌ఫ్రెండ్, ఇంకో అమ్మాయి కలిసి లావణ్యపై ఎందుకు ఫిర్యాదు చేశారు? అని శేఖర్ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శేఖర్ ఆరోపణలపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











