For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR Making Video: రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా.. రాజమౌళి నెవ్వర్ బిఫోర్ మేకింగ్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  |

  పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీ RRR అసలు హంగామా మొదలైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్ పై అంచనాలు ఇప్పటికే అకాశాన్ని దాటేశాయి. ఇక ఈ రోజు విడుదల చేసిన రోర్ ఆఫ్ RRR మేకింగ్ వీడియో కూడా అంచనాల డోస్ మరింత పెంచేసింది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ ను అందించింది.

  నెవ్వర్ బిఫోర్ అనేలా..

  నెవ్వర్ బిఫోర్ అనేలా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఊరిస్తోంది. కేవలం మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

  విడుదలైన కొన్ని నిమిషాల్లోనే

  విడుదలైన కొన్ని నిమిషాల్లోనే

  ఇక సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు గత వారం నుంచి సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా రొర్ ఆఫ్ RRR వచ్చేసింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో నిలిచింది. సినిమా కోసం చిత్ర యూనిట్ ఏ స్థాయిలో కష్టపడిందో అర్ధమయ్యింది.

   ఎమోషన్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్

  ఎమోషన్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్

  మొత్తానికి మేకింగ్ వీడియోలో యాక్షన్ డోస్ మామూలుగా ఉండదని క్లారిటీ ఇచ్చేశారు. నిప్పు, నీరు అనే కాన్సెప్ట్ కూడా చాలా బలంగా ఉన్నట్లు అర్థమవుతొంది. ఎమోషన్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉందని క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.

  రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు

  రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు

  ఇక సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న అనుమానాలకు మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అక్టోబర్ 13న వస్తుందా రాదా అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న ప్రేక్షకులకు ఈ మేకింగ్ వీడియోలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలోని రెండు సాంగ్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్ మోస్ట్ తుది దశలోనే ఉన్నాయి.

  ప్రీ రిలీజ్ బిజినెస్

  ప్రీ రిలీజ్ బిజినెస్

  గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా, నందమూరి కలయికలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయగలదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. నార్త్ ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 900కోట్లకు చేరిన విషయం తెలిసిందే.

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
  ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు

  ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు

  దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ ఎక్కువగానే చేశాడు. ఎందుకంటే ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో సమానంగా చూపించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కాస్త హెచ్చు తగ్గులు వచ్చినా కూడా అభిమానుల్లో ఆలోచనలు ఒక్క సేకనులో మారిపోతాయి. అందుకే స్క్రిప్ట్ మొత్తం బలంగా సిద్ధం చేసుకొని సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చిత్ర యూనిట్ లోని కొందరు వివరణ ఇచ్చారు.

  English summary
  Pan India Big Budget Movie RRR The real buzz has started. Speculations on this visual wonder directed by Rajamouli have already skyrocketed. And the Roar of RRR making video released today also raised the dose of expectations even further.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X