For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Roar Of RRR: మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న రాజమౌళి టీమ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

    |

    ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR టాప్ లో ఉందనే చెప్పాలి. వెండితెరపై రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లను దర్శకుడు రాజమౌళి హై వోల్టేజ్ ఎమోషన్స్ తో చూపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే అర్ధమయ్యింది. ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా క్లారిటీ ఇస్తూ డేట్, టైమ్ కూడా చెప్పేశారు.

    మెగా, నందమూరి సెలబ్రేషన్

    మెగా, నందమూరి సెలబ్రేషన్

    RRR అంటే కేవలం సినిమానే కాదు. మెగా, నందమూరి అభిమానులు మొదటిసారి కలిసిపోయి సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా దర్శనమివ్వబోతున్న విషయం తెలిసిందే.

    స్పీడ్ పెంచిన రాజమౌళి

    స్పీడ్ పెంచిన రాజమౌళి

    డివివి.దానయ్య ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 450కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా వలన బ్రేక్ వచ్చింది గాని లేకపోతే ఈపాటికే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చేది. ఇక సెకండ్ వేవ్ అనంతరం మళ్ళీ షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచారు. కేవలం రెండు సాంగ్స్ అలాగే కొంత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

     Roar of RRR డేట్ ఫిక్స్

    Roar of RRR డేట్ ఫిక్స్

    ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని చాలా రోజులుగా అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ స్పందించింది. ఈ నెల 15న ఉదయం 11గంటలకు రోర్ ఆఫ్ RRR పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. హీరోలకు సంబంధించిన కొన్ని మేకింగ్ సీన్స్ అందులో హైలెట్ అవుతాయట.

    Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
    రిలీజ్ ఎప్పుడంటే?

    రిలీజ్ ఎప్పుడంటే?

    సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా అసలైన క్లారిటీ అయితే రాలేదు. పోస్టర్స్ పై ప్రతిసారి అక్టోబర్ 13 అని క్లారిటి ఇస్తున్నారు గాని మాకు నమ్మకం లేదు దొర అంటూ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక మేకింగ్ విడియోతోనే ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాలో అజయ్ దేవ్ గన్, శ్రియ లాంటి వారు ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Tollywood's Biggest Multistarrer Movie RRR Pan India is about to live up to expectations. Director Rajamouli, who was careful in his promotion, not only gave the entire movie update but also left a special poster and gave a good kick to the fans of both the categories. This time Pawan Kalyan's name also went viral in the promotion which is a special attraction,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X