Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RAPO 19: మరో సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ పోతినేని.. రంగంలోకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఎట్రాక్ట్ చేస్తాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న రామ్ ఆ తరువాత రెడ్ సినిమాతో మీడియం రేంజ్ హిట్ అందుకున్నాడు. రెడ్ అనుకున్నంత స్థాయిలో లాభాలను అందించలేకపోయిందని రామ్ కొంత అప్సెట్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. కిషోర్ తిరుమల ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ సారి ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో మరో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని రామ్ కోలీవుడ్ సీనియర్ దర్శకుడితో చేతులు కలిపాడు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక ద్విభాషా సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ ను పెంచేస్తోంది. ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేశారు.
అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన చిత్ర యూనిట్ రామ్ సినిమాతో సాలీడ్ సక్సెస్ ను అందుకోవడానికి రెడీ ఆవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రామ్ - దేవి శ్రీ ప్రసాద్ సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. నేను శైలజా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే తరహాలో మాస్ స్టైల్ లో హిట్టు కొట్టాలని అనుకుంటున్నారు. మరి సినిమా రామ్ బాక్సాఫీస్ రేంజ్ ను ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి.