twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెస్ట్ మోడ్‌లో రోజా.. ప్రజాక్షేమం కోరుతూ జబర్ధస్త్ జడ్జ్ ఏం చేసిందో తెలిస్తే షాక్!

    |

    జబర్దస్త్ జడ్జ్, నగరి ఎమ్మెల్యే ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉంది. తన కుటుంబంతో హాయిగా గడుపుతూ వంటింటికే పరిమితమైంది. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తానే స్వయంగా పోస్ట్ చేసింది. మరి ఈ జబర్దస్త్ జడ్జ్ రోజా ఇలా ఇంటికే పరిమితం కావడానికి కరోనా ఎఫెక్టే కారణమా? లేక ఇంకేమైనా ఉందా? వివరాల్లోకి పోతే..

    ఆనాటి నుంచి నేటి వరకూ అదే తీరు.. రోజా ప్రయాణం

    ఆనాటి నుంచి నేటి వరకూ అదే తీరు.. రోజా ప్రయాణం

    టాలీవుడ్ చిత్రసీమలో ఆనాటి నుంచి నేటి వరకూ అదే పాపులారిటీ కొనసాగిస్తూ వస్తున్న నటీమణి రోజా. ఆ రోజుల్లో హీరోయిన్‌గా ఎంతైతే అభిమానం చూరగొండో.. ఇప్పుడు జబర్దస్త్ జడ్జ్‌గా అంతే అభిమానం చూరగొంటోంది. చూస్తుంటే అప్పుడు వెండితెర హంగామా.. ఇప్పుడు బుల్లితెర జోష్ అన్నట్లుగా సాగుతోంది అమ్మడి ప్రయాణం.

    రాజకీయాల్లో ప్రత్యేక శైలి.. కుటుంబంతో హాయిగా!

    రాజకీయాల్లో ప్రత్యేక శైలి.. కుటుంబంతో హాయిగా!

    ఇకపోతే రాజకీయాల్లోనూ రోజాకు స్పెషల్ గుర్తింపుతో పాటు భారీ ప్రజా ఫాలోయింగ్ ఉంది. వైసీపీ రాజకీయ నేతల్లో కీలకమైన వ్యక్తిగా ఉంటూనే నగరి ఎమ్మెల్యేగా ప్రజా సేవలో, పరిపాలనలో భాగమవుతోంది రోజా. ఇటు షూటింగ్స్ అటు రాజకీయం రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళింది.

    ఇల్లు విడిచి బయటకురాని పరిస్థితి..

    ఇల్లు విడిచి బయటకురాని పరిస్థితి..

    దేశంలో కరోనా మహమ్మారి వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో మరో మూడు వారాల పాటు అనగా వచ్చే నెల 14 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ పారద్రోలడంలో అందరూ భాగం కావాలని చెప్పారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇల్లు విడిచి బయటకు రావడం లేదు.

    వాళ్ళతో జాలీగా రోజా.. అలా ఎంజాయ్!

    వాళ్ళతో జాలీగా రోజా.. అలా ఎంజాయ్!

    ఈ నేపథ్యంలోనే రోజా సైతం ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. వంటింట్లో గరిటె తిప్పుతూ తన కుటుంబ సభ్యులకు రుచికరమైన వంటలు చేస్తోంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తన జాలీ టైమ్ తాలూకు వీడియోను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది రోజా.

    మీ బాటలోనే మేము కూడా రోజా గారూ..

    ఈ మేరకు ''సామాజిక దూరం పాటిద్దాం.. ఇంట్లోనే సురక్షితంగా ఉందాం.. ఆంధ్ర కరోనాపై యుద్ధం చేస్తోంది'' అంటూ స్టే హోమ్ ఛాలెంజ్ విసిరారు నటి, ఎమ్మెల్యే రోజా. ఈ వీడియో చూసిన జనం ''మేము సైతం ఇంట్లోనే, మీ బాటలోనే మేము కూడా రోజా గారు'' అంటూ రిప్లై ఇస్తున్నారు.

    ప్రజాక్షేమం కోరుతూ రోజా చేసిన పని..

    ఇకపోతే కరోనా బారిన పడకుండా ప్రజా క్షేమం కోరుతూ తన ఇంట్లోనే ఏకాదశ రుద్రాభిషేకం చేసింది రోజా. ఈ వీడియో కూడా షేర్ చేస్తూ.. ''కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలని మహాన్యాసపూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించాం. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మహా శివుడిని వేసుకున్నా. సర్వేజనా సుఖినో భవంతు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనందరం ఇళ్లల్లో ఉండడమే దేశానికి చేసే పెద్ద సేవ'' అని పేర్కొంది.

    English summary
    Our PM says India LockDown till April 15th with reason of Corona effect. Now Roja is at her home and catch Stay home Challenge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X