సైరా విజయంతో ఆనందం.. చిరంజీవిని సత్కరించిన రోజా రమణి దంపతులు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా దిగ్విజయంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. రెండు వారాలు గడుస్తున్నా.. కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు.
ఇటీవలె ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిసి సైరాను వీక్షించమని కోరిన సంగతి తెలిసిందే. అయితే అందుకు సానుకూలంగా స్పందించిన జగన్.. వీలుచూసుకుని సినిమాను చూస్తానని అన్నారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసైను కూడా కలిశాడు. ఆమె సైరాను వీక్షించి చిత్రయూనిట్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.

ఇక అదే విదంగా ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి, భర్త చక్రపాణి కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. అనంతరం సైరా సినిమా గురించి కాసేపు ముచ్చటించారు. సైరా ఇంతటి ఘన విజయాన్నినమోదు చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. చిరంజీవిని సత్కరించారు. ఇప్పటికే తెలుగులో వంద కోట్ల షేర్ ను రాబట్టేసింది. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్‌పై రామ్ చరణ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు.



Click it and Unblock the Notifications











