"రొమాంటిక్ క్రిమినల్స్"ను సిద్ధం చేస్తున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!
కంటెంట్ ఉన్న చిత్రాలకు బడ్జెట్‌లు అవసరం లేదని నిరూపించి టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియోట్ చేసిన పి.సునిల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రం 'రొమాంటిక్ క్రిమినల్స్'. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్ల పై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతల్లో ఒకరైన బి.బాపిరాజు మాట్లాడుతూ.. ''ఈ సినిమా పూర్తిగా నవ్యాంధ్రలో స్మార్ట్‌సిటిగా పేరుగాంచిన విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంది. ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆశక్తికరంగా తెరకెక్కించాం. ఈ చిత్రం గత రెండు చిత్రాలకంటే ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజనీరింగ్ కాలేజి స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరోగా మనోజ్ నందన్, విలన్‌గా వినోద్, హీరోయిన్లుగా అవంతిక, దివ్య, మౌనిక నటించారు. ఏజెన్సీ ఎరియాలోని గంజాయి తోటలో పోలీసుల భద్రత మధ్య ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. వ్యసనాలు ఏమైనా వాటి పర్యవససానాలు వినాశకరంగా ఉంటాయనే పాయింటును వినోదాత్మకంగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు.'' అన్నారు

దర్శకుడు పి.సునిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ముందు చేసిన రెండు చిత్రాలను మించి వినోదంతో పాటు చక్కటి సందేశం వుంటుంది. ఈ చిత్రానికి ఎస్.వి. శివరామ్ సినిమాటోగ్రఫి హైలెట్ అవుతుంది. విశాఖ, అరకు అందాలే కాకుండా గంజాయి తోటల్లో పోలీసులు దాడి చేసే సన్నివేశాలు చక్కగా చిత్రీకరించాము. సుధాకర్ మారియో సంగీతం సారథ్యంలో నాలుగు పాటలు చాలా చక్కగా కుదిరాయి. త్వరలో ప్రముఖ ఆడియో సంస్థ ద్వారా ఆడియో విడుదల చేస్తాం. మే నేలలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.'' అని తెలిపారు.
నటీనటులు: మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక , ఎఫ్.ఎమ్ బాబాయ్, బుగతా, సముద్రమ్ వెంకటేష్ తదితరులు.
సాంకేతిక వర్గం
పాటలు: బాల వర్దన్
సంగీతం: సుధాకర్ మారోయో
కెమెరా: ఎస్.వి. శివరామ్
ఎడిటింగ్: శామ్యుల్ కళ్యాణ్
సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్
నిర్మాతలు: ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు
కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి


Click it and Unblock the Notifications











