రొమాంటిక్ పోస్టర్.. సూపర్ స్టార్ రజనితో సిమ్రన్.. వయసులో వెనక్కి!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పెట్ట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రంలో రజనీని స్టైలిష్ లుక్ లో చూపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో రజనీకాంత్ గెటప్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజగా ఈ చిత్ర రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు. రజనీకాంత్, సిమ్రన్ కలసి ఉన్న ఈ పోస్టర్ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్టైలిష్ లుక్ లో రజని కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఇక సిమ్రన్ కూడా వయసులో వెనక్కి వెళ్ళిపోయి పాతరోజులు గుర్తు చేస్తోంది.

త్రిష కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుస్తోంది.


Click it and Unblock the Notifications











