twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Room First Look.. రొమాంటిక్‌ పోస్టర్ రిలీజ్.. హీరో ఎవరంటే?

    |

    అశ్విన్ అండ్ రమేష్ కే సమర్పణలో, పద్మావతి పిక్చర్స్ పతాకంపై, అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో వీఎస్ సుబ్బారావు నిర్మించిన చిత్రం "రూమ్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్ చేతుల మీదుగా" రూమ్" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. వీరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Room

    ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సుబ్బారావు. అఖండ కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మి డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అటువంటి వ్యక్తి రూమ్ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత రామరాజు గారి అబ్బాయి అభిషేక్ వర్మ హీరో గా నటించాడు. మంచి కంటెంట్ తో వస్తున్న రూమ్ బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

    చిత్ర నిర్మాత సుబ్బారావు మాట్లాడుతూ.. పద్మావతి ఫిలింస్ పేరుతో డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేశాను. ఇందులో 80% సినిమాలు చిరంజీవి గారి సినిమలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన అదుగో సినిమా చూశాను అందులోని అభిషేక్ వర్మ ను చూసి ఈ సినిమాకు సెలక్ట్ చేశాము. దర్శకుడు తమిళ్ లో చేసిన పార్టీబన్ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా లో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేశారు సినిమా బాగా వచ్చింది అన్నారు.

    నిర్మాత రామారాజ్ మాట్లాడుతూ.. సుబ్బారావు, నేను సమకాలికులం. దర్శకుడు కన్మణి గారు మంచి సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకున్నాడు. మా అబ్బాయిని హీరో గా పెట్టీ సినిమా తీసిన సుబ్బారావు కు ధన్యవాదములు అన్నారు.

    నటుడు బెనర్జీ మాట్లాడుతూ..చిత్ర నిర్మాత సుబ్బారావు గారు గత 40సంవత్సరాల నుండి సినిమా హిట్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.అలాంటి తను సెలక్ట్ చేసుకున్న ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందమే నమ్మకం ఉంది.ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు.దర్శకుడు ఈ సినిమాను చాలా న్యాచురల్ గా తీశాడు. యూత్ కు ఈ సినిమా బాగా అటాచ్ అయ్యే సినిమా.సినిమా చూసిన తర్వాత యూత్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడు కునే విధంగా ఉంటుంది అన్నారు.

    చిత్ర దర్శకుడు పద్మ మగన్ మాట్లాడుతూ.. కొత్త వారితో ఏ జానర్ చేసినా క్వాలిటీ లో రాజీ పడకుండా సినిమా చేస్తాను. .ఈ సినిమాలో మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా అది ఎంతవరకు ఉండాలో అంతే లిమిట్ లో ఉంటుంది. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలానే ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీ తో ఈ సినిమా చేశాము. అభిషేక్ నటించిన సినిమా చూసి తనైతే క్యారెక్టర్ కు షూట్ అవుతాడాని సెలెక్ట్ చేశాము.హీరో,హీరోయిన్ లు ఇద్దరూ సెట్ అవ్వడంతో మొదటగా వర్క్ షాప్ చేసి ఓకే అనుకున్న తరువాత షూట్ కెళ్ళాము . ఈ సినిమా ను 60% ఓకే రూమ్ లో షూట్ చేయడం జరిగింది. బాష ఏదైనా నన్ను నా కథను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు.

    హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను 26 సినిమాలు చేశాను. ఇన్ని సినిమాలు చేసినా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. ఇది లాస్ట్ మూవీ అనుకొని చేశాను.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. కెమెరామెన్ నన్ను చాలా అందంగా చూయించారు. ఇదే లాస్ట్ సినిమా అనుకుని చేసిన నాకు అందరూ ఇదే మొదటి సినిమా అవుతుంది అన్నారు. ఈ సినిమా తర్వాత నీకు అనేక సినిమాలలో నటిస్తావు అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.

    Room First Look

    హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా కచ్చితంగా నవ్వుకునేలా చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ వుంటుంది. ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు పద్మ మగన్ నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు అన్నారు.

    సహా నిర్మాత అశ్విన్ మాట్లాడుతూ..రూమ్ సినిమా బాగా వచ్చింది. త్వరలో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

    మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది సీనియర్స్ వర్క్ చేశారు. ఈ సినిమాకు పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్. అందుకే ఇందులో పాటలు లేవు.. యూత్ ఫుల్ సబ్జెక్టు గా వస్తున్న "రూమ్" సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

    గెస్ట్ గా వచ్చిన దర్శకుడు కన్మణి మాట్లాడుతూ..ఈ సినిమాలో కంప్లీట్ ఫన్ ఉంటుంది. సినిమా చూసిన యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు..హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా చక్కగా నటించారు.బెనర్జీ లాంటి సీనియర్ యాక్టర్ ఇందులో నటించడం వలన ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

    నటీ నటులు: అభిషేక్ వర్మ, మనో చిత్ర , బెనర్జీ, సంపంత్ రామ్, తెరి దీన తదితరులు
    నిర్మాత: వీయస్ సుబ్బారావు
    కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పద్మ మగన్
    డీవోపి: ఎమ్ యస్. ప్రభు
    ఎడిటర్: సీఎస్ ప్రేమ్
    మ్యూజిక్ డైరెక్టర్: వినోద్ యాజమాన్య
    ఆర్ట్ డైరెక్టర్: పీ రాజు

    English summary
    Room Movie first look has unveiled by Prasanna Kumar at film Chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X