అవును మేము పుడింగిలమే: ‘బిచ్చగాడు’ హీరోకి రోషం ఎక్కువే!
'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తాజాగా తమిళంలో నటిస్తున్న 'తిమిరపుడిచవాన్' అనే చిత్రం తెలుగులో 'రోషగాడు' పేరుతో విడుదల కాబోతోంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. కుమారస్వామి అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించబోతున్నాడు.
అవును మేము పుడింగిలమే.. పోలీసులంటే పెద్ద పుడింగులమే. మీరు రాత్రిపూట ఫ్యాన్ వేసుకుని హాయిగా నిద్రపోతుంటే కుక్కల్లా నిద్రలేకుండా రోడ్డు మీద కాపలా కాస్తుంటామే మేం పుడింగులమే... మీ తాగుబోతు మొగుడు తాగేసి బైక్ నడుపుతూ కింద పడిపోతే చావకూడదనే వాడిని రోడ్డు మీద ఆపి పైప్ పెట్టి చెక్ చేసి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నామే మేము పుడింగిలమే.. అంటూ ఆవేశంగా డైలాగులు చెబుతూ అదరగొట్టాడు.
యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నివేథా పేతురాజ్ హీరొయిన్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
తాజాగా విడుదలైన టీజర్లో ''ఒళ్లంతా పొగరురా... పొగరుకె మొగుడురా... మొగుడురా పొగరుకే.. పడడు మాట రోషగాడు రా..' అంటూ లిరిక్స్ ఉండటాన్ని బట్టి హీరో క్యారెక్టర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రై.లి, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, మాటలు, డైలాగ్స్, దర్శకత్వం గణేషా. దీపావళి సందర్బంగా సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











