రెడ్డిగారింట్లో రౌడీయిజం మూవీకి సీక్వెల్.. 15 ఏళ్ల కల నెరవేరింది.. డైరెక్టర్ ఎమోషనల్
సిరి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నటుడు వినోద్ కుమార్,రమణ్, వర్ష విశ్వనాధ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, నటీనటులుగా ఎం.రమేష్, గోపి దర్శకత్వంలో కె.శిరీషా రమణా రెడ్డి నిర్మించిన చిత్రం 'రెడ్డిగారింట్లో రౌడీయిజం' . ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

హీరో రమణ్ మాట్లాడుతూ..నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి కల. 15 సంవత్సరాల నుంచి కష్టపడిన నాకు సిరి మూవీస్ లో చేసిన "రెడ్డిగారింట్లో రౌడీయిజం" ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇన్ని పెద్ద సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము రిలీజ్ చేసిన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "రెడ్డి గారింట్లో రౌడీయిజం" సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.అలాగే ఇంకా చూడనివారు మా సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుచున్నాం. ప్రేక్షకులు మా కిచ్చిన సపోర్ట్ తో మేము త్వరలో రెడ్డిగారింట్లో రౌడీయిజం పార్ట్ 2 కూడా తీయబోతున్నాం అని అన్నారు.
చిత్ర దర్శకుడు గోపి మాట్లాడుతూ ..ప్రతి ఒక్క మనిషిలోను దేవుడు ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ. కులం, మతం కంటే... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే గొప్ప మానవత్వం అనే సందేశంతో సున్నితమైన కథను తెరకెక్కించాలని రమణ్ గారికి ఈ కథ చెప్పగానే సింగిల్ సిటింగ్ లో సినిమా కథను ఓకే చేశాడు.హీరో కావాలి అనుకునే తనకు 15 సంవత్సరాల కలను నెరవేర్చుకుంటే ఇందులో మాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించి మాకు జీవితకాలం కలను నెరవేర్చాడు. వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.
మరో దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా సినిమా పాటలను హీరో రామ్ చరణ్ గారు లాంచ్ చేయడంతో మా సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళ్ళింది.అందుకు వారికి మా ధన్యవాదాలు. అలాగే డైరెక్టర్స్ వి.వి.వినాయక్, వి.యన్ ఆదిత్య ,హీరోలు శ్రీకాంత్,సప్తగిరి ఇలా ఇండస్ట్రీలో చాలా మంది మాకు సపోర్ట్ చేశారు.వారందరికీ మా ధన్యవాదాలు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో హీరో పక్కింటి కుర్రాడు లాగా అద్భుతంగా నటించాడు అని అన్నారు
హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇందులో నేను లీడ్ రోల్ గా చేశాను .హీరో రమణ్ నటనలో ఎంతో అనుభవమున్న నటుడిలా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్, ఎమోషన్ సీన్స్ అన్నీ చాలా చక్కగా కుదిరాయి. విడుదలైన ప్రతిచోటా మమ్మల్ని మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు
నటీనటులు: రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష, వినోద్ కుమార్, రచ్చ రవి, మిర్చి మాధవి, జూనియర్ బాలకృష్ణ, శంకర్, కృష్ణ, ప్రకాష్ అడ్డా, వెంకట్, సిద్ధు తదితరులు
రచన-దర్శకత్వం: ఎం. రమేష్, గోపి
నిర్మాత: కె. శిరీషా రమణారెడ్డి
బ్యానర్: సిరి మూవీస్
సమర్పణ: కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి
రిలీజ్: స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్
సంగీతం: మహిత్ నారాయణ్
బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీవసంత్
సినిమాటోగ్రఫీ: ఎ.కె. ఆనంద్
ఎడిటింగ్: శ్రీనివాస్ పి. బాబు, సంజీవరెడ్డి
ఆర్ట్: నరేష్ సిహెచ్.
ఫైట్స్: అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్రఫీ: చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ


Click it and Unblock the Notifications











