నెట్టింట దుమ్మరేపుతున్న రౌడీ బేబీ, అచ్చంగా 90కోట్ల మంది మెచ్చిన పాటగా రికార్డు

విడుదలైన నాటి నుంచి, అందరి ఊతపదంగా మారిపోయిన రౌడీ బేబీ పాట ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సెట్ చేసుకుంటూనే పోతోంది. మారీ -2 ఆడియో విడుదలైన దగ్గర నుంచి రకరకా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ పాట, ఇప్పటికే ఎన్నో ఆవార్డులు రివార్డులూ కొల్లగొట్టింది. ఇక తాజాగా యూట్యూబ్ ను ఊపేస్తోందట మన రౌడీ బేబీ.

ఒకటిన్నర ఏడాది క్రితం విడుదలైన ఈ పాట, ప్రస్తుతం యూట్యూబ్ లో 90 కోట్ల వ్యూస్ దాటేసింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, లిరిక్స్ తో పాటూ, ధనుష్, సాయిపల్లవిల డాన్సింగ్ కెమిస్ట్రీ, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ, దానికి తగ్గట్లు లీడ్ పెయిర్ స్టెప్పులు ఇరగ దీసిన విధానం, వెరసి రౌడీ బేబీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందన్న సంగతి తెలిసిందే.

Rowdy Baby creates wonders, Reach 900 Millon Views on Youtube

రౌడీ బేబీ పాటను అచ్చంగా 90 కోట్ల మంది చూసేయగా, ఇప్పుడు ఆ మార్కును దాటి వందకోట్ల వ్యూస్ సాధించే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ లీడింగ్ పొజిషన్ లో ఉన్న బాలీవుడ్ పాటలను సైతం రౌడీ బేబీ వెనక్కు నెట్టేయడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X