For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రౌడీతో వంద కోట్ల సినిమా... ఇంద్రగంటి ఐడియా... దిల్ రాజు రెడీ...

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ రేంజును అందుకునేందుకు మరి కొద్ది అంగుళాల దూరంలోనే ఉన్న విజయ్ దేవరకొండ, రాబోయే రోజుల్లో ఆ గ్యాప్ ను ఫిల్ చేసి, నంబర్ వన్ ప్లేస్ ను కైవసం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్సాఫీస్ షేక్ చేసినా, మన రౌడీ హీరో ఇంకా వంద కోట్ల లీగ్ లోకి ఎంటరవ్వలేదనే చెప్పాలి. అయితే అబ్బాయి ముచ్చట తీర్చేందుకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రంగంలోకి దిగారట. అంతే కాదు టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి విజయ్ కు సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యతను భుజంపై వేసుకున్నారు.

    వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం అచ్చంగా వంద కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే చకచకా నడిచిపోతున్నాయని తెలుస్తోంది.

    Rowdy hero to get his space in the big league

    మరోవైపు శివ నిర్వాణతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమాలో నటిస్తున్న విజయ్ ఇందులో అనన్యా పాండేతో రొమాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి, వంద కోట్ల భారీ బడ్జెట్ సినిమాను కైవసం చేసుకున్న విజయ్, అదే స్థాయిలో తనపై పెరుగుతున్న అంచానాలను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

    English summary
    Tollywood Rowdy Vijay Devarakonda bags another biggie and the big buget flick is to be made with a lavish budget of 100crores. Mohana Krishna Indraganti to healm the megaphone as DilRaju to bankroll the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X