ప్రభాస్ మూవీకి ‘రాయల్’ టైటిల్: రెబెల్ స్టార్ రేంజ్‌కు సరిపోయే విధంగా!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా అతడు పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత యమ జోష్‌తో దూసుకుపోతోన్నాడు. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రభాస్.. ఇటీవలే 'ఆదిపురుష్' అనే సినిమాతో వచ్చాడు. ఇక, ఇప్పుడు ఈ బడా హీరో 'సలార్', 'ప్రాజెక్టు K', 'స్పిరిట్'తో పాటు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితోనూ ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.
ప్రభాస్ ప్రస్తుతం మారుతితో కలిసి చేస్తున్న మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ను జరుపుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.

హర్రర్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే పేరును పెడుతున్నట్లు ఆరంభం నుంచీ ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ తర్వాత మరికొన్ని టైటిళ్లు కూడా తెరపైకి వచ్చాయి. వీటిలో 'అంబాసీడర్' అనే పేరు దాదాపుగా ఖాయం అని టాక్ వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ - మారుతి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి 'రాయల్' (Royal) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ పేరును చిత్ర నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో సైతం రిజిస్టర్ చేయించారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
ఇక, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











