ఆ హీరో క్రేజ్ అలాంటిది.. ఆ రోజు హౌస్‌ఫుల్.. స్టూల్ వేసుకొని సినిమా చూశా.. ఆర్పీ పట్నాయక్
గోల్డెన్‌స్టార్ గణేశ్, హ్యాట్రిక్ హీరోయిన్ రశ్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'గీతా... ఛలో'. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో 'చమక్' పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో 'గీతా.. ఛలో' పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను రామానాయుడు స్టుడియోలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు వీఎన్ ఆదిత్య, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్, బాలాజీ నాగలింగం తదితర ప్రముఖులు హాజరై పాటలను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు.

రష్మిక గురించి కాదు.. గణేష్ క్రేజ్ అలా
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘అందరూ హీరోయిన్ రష్మిక మందన్న గురించే చెబుతున్నారు. ఇక్కడ హీరో గురించి కూడా చెప్పుకోవాలి. గణేశ్ ‘ముంగారు మలే' సినిమా విడులప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను. ఎలా ఉందో చూద్దామని వెళితే థియేటర్ ఫుల్ అయిపోయింది. అందుకే స్టూల్ వేసుకుని మరీ చూశా. ఆ సినిమా చూశాక చాలా బాగా నచ్చి మళ్లీ ఇంకోసారి వెళ్లి చూశా. గణేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దివాకర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఇక్కడికి వచ్చా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.'' అన్నారు.

హీరో, హీరోయిన్లకు సక్సెస్ రేటు ఎక్కువ
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "హీరోయిన్ తో పాటు హీరోకి కూడా మంచి సక్సెస్ రేటు ఉంది. ఇది డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తోంది. ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం వాళ్ళు ఆతృతగా ఎదురుచూస్తున్నారు." అని చెప్పారు.

గురువు సీ కల్యాణ్‌కు కృతజ్ఞతలు
మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మా గురువు కల్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ సినిమా రూ. 30 కోట్లు వసూలు చేసింది. గీతాగోవిదం సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయి. ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఈ నెల 26న విడుదల అవుతుంది. అందరూ తప్పక చూడండి.'' అన్నారు.

సినిమాను డబ్బింగ్ ఎందుకు చేశామంటే..
దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నాం. అయితే రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాబట్టి రీమేక్ సినిమాలో చేయదని, ఆమె తప్ప ఈ సినిమాలో ఎవరూ సూట్ అవ్వరని డబ్ చేస్తున్నాం. ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక కూడా చేస్తున్నాం. తర్వాత 26న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ తప్పక చూసి ఆదరించాలని కోరుకుంటున్నా.'' అన్నారు.


Click it and Unblock the Notifications











