For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుర్ర లేనోళ్లు చానళ్లు పెట్టారు.. ఛ మీదీ ఒక బ్రతుకేనా... ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు!

  |

  ప్రముఖ సంగీత దర్శకుడు తర్వాతికాలంలో దర్శకుడిగా మారిన ఆర్.పి.పట్నాయక్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలంటూ రెండు రోజుల క్రితం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ వీడియో కారణంగా ఆయన మరో వీడియో చేయాల్సి వచ్చింది.. ఇక మొదటి వీడియో గురించి ప్రస్తావిస్తూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

  సినిమాలకు దూరంగా

  సినిమాలకు దూరంగా

  నీకోసం' (1999) సినిమాతో మ్యూజిక్ కెరీర్ ప్రారంభించిన ఆర్పీ పట్నాయక్.. ‘మనలో ఒక్కడు' (2016) సినిమా తరువాత మరో సినిమా చేయలేదు.. 17 ఏళ్లపాటు తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా మ్యూజిక్ అందిస్తూ మరోవైపు నటిస్తూ మన్ననలు పొందారు. ఆయన మ్యూజిక్ అందించిన, గొంతు కలిపిన స్వరం సాంగ్స్ చాలా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆయన కొన్ని కారణాల వలన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ సాటి మనిషిగా అందరినీ ఉద్దేశిస్తూ ఆయన మొన్న ఒక వీడియో విడుదల చేశారు.

  కరోనా అవేర్నెస్ వీడియో

  కరోనా అవేర్నెస్ వీడియో

  ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తుందని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉండటం‍తో సమయానికి వైద్యం అందక సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారని ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల తీరు, కార్పోరేట్‌ హాస్పిటల్స్ దోపిడిపై ఆర్పీ పట్నాయక్‌ అగ్రహం వ్యక్తం చేశారు. " మా అమ్మకు బెడ్ దొరకలేదని హాస్పిటల్‌ సిబ్బంది మీద కొంతమంది దాడి చేశారు, బెడ్స్ లేనప్పుడు వారు ఇవ్వలేరు కదా?.. అమ్మ చనిపోతే కోపం రావచ్చు, కానీ కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోన్న సిబ్బంది మీద దాడి చేయడం వల్ల మిగతా వాళ్లు బాధలు పడాల్సి వస్తుంది అని అన్నారు. .

  చేతులెత్తి మొక్కుతున్నా

  చేతులెత్తి మొక్కుతున్నా

  ఇక ‘కరోనా లెక్కలన్నీ కూడా సరైనవి కావన్న ఆయన అసలైన లెక్కలు శశ్మానాలలో కనిపిస్తున్నాయని శవాలు కూడా క్యూలో ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో ఎలక్షన్స్‌ ముఖ్యం, ఫలితాలు ముఖ్యం.. గెలిచింది.. ఓడింది.. నైతిక విజయం.. అంటూ రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. .. ఎన్నికలు అయ్యాయి కదా వాటి మీద మీరు పెట్టిన శ్రద్ద కనీసం ఒక్క శాతమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద పెట్టండి.. దయచేసి మొక్కుతున్నా.. కనీసం ఉన్న వాళ్లను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం చేయండి' ఆయన అభ్యర్థించారు.

  థంబ్ నైల్స్ రచ్చ

  థంబ్ నైల్స్ రచ్చ

  అయితే ఆయన చేసిన వీడియోను చాలా యూట్యూబ్ ఛానళ్లు వాడుకున్నాయి. వాడుకుంటే వాడుకున్నాయి కానీ ఆ యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన థంబ్ నెయిల్స్ ఆర్పీ పట్నాయక్ కి ఆగ్రహం తెప్పించాయి. వీడియోలో ఎవరినో ఉద్దేశిస్తూ మా అమ్మ అని అంటే ఆర్పీ తల్లికి కరోనా వచ్చిందని ఛానల్స్ వాళ్ళు తప్పుడు తంబ్స్ పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అందరు రాజకీయ నాయకులను ఉద్దేశించి తాను మాట్లాడితే ఆర్పీ పట్నాయక్ ఫలానా రాజకీయ నాయకుడి గురించి కామెంట్స్ చేశాడు అని పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  అందుకే అసహ్యం

  అందుకే అసహ్యం

  ఇలా చేస్తారు కాబట్టే యూట్యూబ్ ఛానల్స్ ఎవరు అడిగినా తాను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆసక్తి చూపించను అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ చానల్స్ అంటే అసహ్యం అని పేర్కొన్న ఆయన ఎవడు పడితే వాడు చానల్స్ పెట్టి ఏది పడితే అది చేస్తున్నారని అన్నారు. అలా చేయడానికి సిగ్గులేదా అంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను అని ఇక మీదట అయినా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ఈ వీడియోని కూడా వాడుకుని " యూట్యూబ్ ఛానల్ మీద విరుచుకుపడిన ఆర్పి, యూట్యూబ్ చానల్స్ అంటే అసహ్యం అంటున్న ఆర్పి అని టైటిల్స్ పెట్టి వాడుకోవాలని ఎద్దేవా చేశారు.

  Nagababu Praises Kirrak RP At His New Movie Opening Event
  మాస్క్ ఇలా వాడండి

  మాస్క్ ఇలా వాడండి

  ఇక చివరిగా ఆయన ముగిస్తూ చాలా మంది తాను ముందుగా చేసిన వీడియోకి స్పందించారని హాస్పిటల్స్ కూడా రేట్లు తగ్గించిన ఆలోచన చేస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. అయితే చాలా మంది డాక్టర్లు మాస్క్ ధరించడం గురించి ఒకసారి అందరికీ గుర్తు చేయమని అడిగారని ఆయన చెప్పుకొచ్చారు.. మాస్క్ ఎలా ధరించాలి ? ఎలా ధరిస్తే కరోనా బారిన పడకుండా ఉంటాము అనే అంశాలను కూడా ఆర్పి పట్నాయక్ వీడియోలో వివరించారు.

  English summary
  Famous Telugu music director RP patnaik has released video regarding covid cases few days back. few YouTube channels used this video in their channel and uploaded some irrespective thumbnails degrading RP patnaik. recently RP patnaik released another video regarding this YouTube thumbnails and he slammed youtubers who is uploading this type of thumbnails.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X