twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dharam tej మీద కాదు.. వాళ్ళ మీద కేసులు పెట్టాలి.. ఆర్పీ పట్నాయక్ సంచలనం

    |

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి పెద్ద ఎత్తున టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాయి ధరంతేజ్ నడిపిన బైక్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి గురయ్యారని పోలీసులు చెబుతుండగా ఈ విషయం గురించి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    రోడ్డు ప్రమాదం

    రోడ్డు ప్రమాదం

    మెగాహీరో సాయిధరమ్తేజ్ నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి వెళ్లే మార్గంలో కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత ఐటీసీ కోహినూర్ హోటల్ దగ్గరలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు.. నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా సుమారు 20 నిమిషాల వ్యవధిలో ఆయనను హాస్పిటల్ తీసుకువెళ్లారు అక్కడ ఉన్న పోలీసులు.

    అపోలోకి తరలింపు

    అపోలోకి తరలింపు

    దగ్గరలో ఉన్న మెడికల్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి ఆయనకు వెయిట్ లెటర్ ద్వారా ఊపిరి అందించే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళడంతో ఆయనకు ప్రాణాపాయం ఆయన స్పృహలోకి కూడా వచ్చారు అని వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఆయనను పరామర్శించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్ కి తరలించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూనే 48 గంటలు గడిస్తే గాని ఎలాంటి విషయం వెల్లడించలేమని వైద్యులు వెల్లడించారు.

    వాళ్ళ మీద కూడా కేసులు

    వాళ్ళ మీద కూడా కేసులు

    అయితే సాయి ధరంతేజ్ మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆర్.పి.పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవడానికి కారణమైన అక్కడ ఉన్న కన్స్ట్ర క్షన్ కంపెనీపై మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలోని మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవారు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని నా అభిప్రాయం.

     మితిమీరిన వేగమే

    మితిమీరిన వేగమే

    ఇక సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి ప్రధాన కారణం మితిమీరిన వేగమే కారణమని ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దాని మేరకు రిపోర్టు తయారు చేశారని అంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్ అభియోగంపై సాయిధరమ్ తేజ్‌పై గచ్చిబౌలిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

    Recommended Video

    Sai Dharam Tej Helath Bulletin, డాక్టర్లు ఏమన్నారంటే..? || Filmibeat Telugu
    కేసులు

    కేసులు

    ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. సెక్షన్ 184, 336 సెక్షన్ల ప్రకారం సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేశారని అంటున్నారు. ఇక శనివారం ఉదయం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై బులెటిన్ రిలీజ్ చేయగా దాని ప్రకరం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆదివారం ఉదయం మళ్లీ బులెటిన్ అందిస్తామని వైద్యులు వెల్లడించారు.

    English summary
    RP Patnaik made some sensational comments about Sai Dharam tej accident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X