RRR: జైల్లో రామ్ చరణ్, Jr ఎన్టీఆర్ .. ఆ ఒక్క సీన్ చాలు.. కాల బైరవ ఎమోషనల్ సాంగ్!
RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సమయం ఇంకా చాలా ఉంది. అయితే ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్స్ రోజుకోటి అభిమానుల్లో అంచనాలు డోస్ ను పెంచుతోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా గురించి ఇటీవల అందులో నటించిన ఒక యాక్టర్ ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ముఖ్యంగా ఒక జైలు సీన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాడు.

బిజినెస్ డీల్స్ క్లోజ్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా కోసం తెలుగు జనాలతో పాటు ఇతర ఇండస్ట్రీలోని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఇప్పటికే అన్ని భాషల్లో సినిమా మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

తప్పకుండా హిట్టవుతుందని
బాహుబలి లాంటి హిట్ అనంతరం రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా హిట్టవుతుందని ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కథకు తగ్గట్లుగానే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను సమానంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Recommended Video

కొమురం భీమ్ గ్యాంగ్ లో..
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో RRRలో నటించిన సపోర్టింగ్ యాక్టర్ ప్రశాంత్ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గ్యాంగ్ లోనే తాను ఒక మెంబర్ గా నటిస్తున్నాను. అయితే జైల్లో ఉండే ఒక సీన్ ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ను కలిగిస్తుంది.. అని చెప్పారు.

కాల భైరవ ఎమోషనల్ సాంగ్
జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ళు జైల్లో ఉండే ఒక ఎమోషనల్ సీన్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ప్రశాంత్ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా కాల బైరావ పాడిన ఎమోషనల్ సాంగ్ కూడా హార్ట్ ని టచ్ చేసే విధంగా ఉంటుందట.

మరొక రూమర్ వైరల్..
తప్పకుండా జైల్లో ఉండే సీన్ ఎమోషనల్ గానే కాకుండా గూస్ బంప్స్ ను తెప్పిస్తుందట. అసలే రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటే ఈ యాక్టర్ సినిమాకు సంబంధించిన విషయాలను బయటపెడుతూ మరింత బజ్ క్రియేట్ చేసాడు. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్లాన్ ప్రకారం సినిమా అక్టోబర్ 13న రిలీజ్ చేసే అవకాశం లేదని సంక్రాంతికి రావచ్చని కొత్త రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











