twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్న తమిళ విలన్.. అంతా RRR మహిమ!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో పరభాషా నటులకు వచ్చే అవకాశాలు మరెక్కడా రావనే చెప్పాలి. మన నటీనటులు బయట ఎంతవరకు క్లిక్కవుతారో చెప్పలేము గాని టాలెంట్ ఉండే తమిళ్ యాక్టర్స్ మాత్రం ఇక్కడ మంచి క్రేజ్ అందుకుంటారు. తమిళ్ హీరోల సినిమాలకు తెలుగులో ఏ రేంజ్ లో మార్కెట్ సెట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేసే వాళ్ళు అలాగే విలన్స్ కూడా క్లిక్కవుతున్నారు.

    తెలుగులో బిజీగా..సముద్రఖని

    తెలుగులో బిజీగా..సముద్రఖని

    గతంలో కూడా చాలా మంది తమిళ్ యాక్టర్స్ తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ప్రస్తుత రేంజ్ లో అయితే రెమ్యునరేషన్ అందుకోలేదు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో తమిళ నటుడు సముద్రఖని మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. దర్శకుడిగానే కాకుండా ఒక మంచి నటుడిగా సముద్రఖని బిజీ అవుతున్నాడు.

    అల..వైకుంఠపురములో..

    అల..వైకుంఠపురములో..

    తెలుగులో మొదట అల..వైకుంఠపురములో సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే సముద్రఖని రేంజ్ పెరిగిపోయింది. టాలీవుడ్ ఆడియెన్స్ అతను నటనకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో తెలుగులో గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. కానీ ఈ స్టార్ యాక్టర్ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నాడు.

    RRR రెమ్యునరేషన్..

    RRR రెమ్యునరేషన్..

    సముద్రఖని శంభో శివ శంభో సినిమాతో పాటు నాని జెండాపై కపిరాజు అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక నెక్స్ట్ రవితేజ క్రాక్ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సముద్రఖని RRRలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. RRR సినిమా కోసం సముద్రఖని రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Jackpot Movie Hilarious Trailers | Jyothika | Revathi
     కేవలం అలాంటి సినిమాలనే..

    కేవలం అలాంటి సినిమాలనే..

    ఈ సినిమాలే కాకుండా నటుడిగా మరిన్ని తెలుగు ఆఫర్స్ వస్తున్నాయట. కానీ సముద్రఖని తనకున్న క్రేజ్ ని చెడగొట్టుకోకుండా కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట. ఇక RRR ద్వారా ఈ స్టార్ యాక్టర్ రెమ్యునరేషన్ కూడా ఓ వర్గం హీరోల రేంజ్ లో పెరిగింది. దీంతో దర్శకులు కూడా సముద్రఖనిని కీలక పాత్రల కోసమే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

    English summary
    RRR Producer DVV Danayya gave the final clarity on the film release date. In an interview , said it could not be released in time. The film is expected to be released on January 8, 2021. But due to pending shooting and post-production work, it could not be released in due time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X