RRR మరో రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి పక్కా.. పవన్, ప్రభాస్, మహేష్ సినిమాలు ఎప్పుడంటే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంక్రాంతికి రావల్సిన పెద్ద సినిమాలో ఒక్కసారిగా సమ్మర్ లో కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు అప్పుడు కూడా అనుకున్న సమయానికి వస్తాయా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. RRR చిత్ర యూనిట్ సభ్యులు అయితే మరోసారి అధికారికంగా సరికొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సారి తప్పకుండా రాబోతున్నట్లు గా ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక మిగతా సినిమాల విడుదల తేదీపై కూడా ఒక లుక్కేస్తే..

ఇప్పటికే ఆరుసార్లు వాయిదా
రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRRను దర్శకుడు రాజమౌళి ఎంతో కష్టపడి తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏడోసారి సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అసలైతే జనవరి 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా అపుడు సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
RRR ఫైనల్ డేట్
ఇక కొద్ది సేపటి క్రితం ఈ చిత్రం యూనిట్ సభ్యులు అధికారికంగా మరొక పోస్టర్ను విడుదల చేస్తూ ఇదే ఫైనల్ అని తెలియజేశారు. ఇంతకుముందు సినిమాను మార్చి 18న లేదా ఏప్రిల్ 28వ తేదీన రెండిటిలో ఏదో ఒక తేదీన విడుదల చేస్తామని ఒక ప్రత్యేకమైన పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక ఇప్పుడు ఆ రెండు కాదు అని మార్చి 25వ తేదీన విడుదల ఫిక్స్ చేసినట్లుగా తెలియజేశారు.

ఆచార్య కొత్త డేట్..
చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయాలని మరొక తేదీన అఫీషియల్ గా ప్రకటించారు. రామ్ చరణ్ తేజ్ కూడా ఇందులో సిద్దా అనే పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా కూడా అంచనాలకు మించి ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు.

రాధేశ్యామ్ ఎప్పుడంటే?
ఇక RRR సినిమా తరువాత మరికొన్ని సినిమాలు కూడా విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఫిబ్రవరి 24వ తేదీన వాలిమై సినిమా విడుదల అవుతుండగా మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ భారీ స్థాయిలో విడుదల కానుంది. రాధే శ్యామ్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా త్వరలోనే విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీస్ట్ vs KGF 2
ఇక మార్చి 25వ తేదీన RRR సినిమా వచ్చిన తర్వాత రెండు వారాల పాటు మరొక పెద్ద సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు. ఏప్రిల్ 14వ తేదీన KGF 2 సినిమా అలాగే విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కానుంది. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య లో బాక్సాఫీస్ ఫైట్ తప్పేలా లేదని తెలుస్తోంది. ఎవరు కూడా విడుదల తేదీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

భీమ్లా నాయక్ ఎప్పుడంటే?
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం లో అయితే ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. అసలు అయితే సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో చెప్పారు. కానీ మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన భీమ్లా నాయక్ వచ్చే అవకాశం ఉందట.

మహేష్ 'సర్కారు వారి పాట' న్యూ డేట్
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను మే 27వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. దర్శకుడు పరశురామ్ ఇటీవల ఫైనల్ షెడ్యూల్ ను ఫినిష్ చేసే విధంగా పనులు స్టార్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











