రాజమౌళి మాస్టర్ ప్లాన్.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను కొత్త అవతారంలో

RRR Anime: తెలుగు సినిమా దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Rajamouli) రూటే సపరేటు. ఆయన సినిమా అంటే వరల్డ్ వైడ్ ఆ క్రేజే వేరు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి.. తన సినిమాల ద్వారా అశేష ప్రేక్షక లోకాన్ని అలరిస్తూ భారీ పాపులారిటీ కూడగట్టుకున్నారు. ప్రస్తుతం వారణాసి అనే భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. మహేష్ బాబు- రాజమౌళి కాంబో కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు కొండెక్కాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా వారణాసి రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. ఎస్ ఎస్ రాజమౌళి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ RRR సినిమాను ఇప్పుడు ఆనిమే (Anime) రూపంలో తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే పలు జపాన్ స్టూడియోలతో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని రాజమౌళి స్వయంగా కన్ఫర్మ్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

RRR Anime in the Works SS Rajamouli Plans New Avatar for Ram Charan NTR with Japan Studios

ఇటీవల హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ... 'RRR కథను ఆనిమే ఫార్మాట్‌లో విస్తరించే ఆలోచన ఉంది. జపాన్‌లోని కొన్ని స్టూడియోలతో ఈ విషయంలో చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికీ అధికారికంగా ఏమీ మొదలుకాలేదు కానీ, ఈ ఐడియా నన్నెంతో ఉత్సాహపరుస్తోంది' అని చెప్పారు. ప్రస్తుతం తాను ఆనిమే కంటెంట్ ఎక్కువగా చూస్తున్నానని కూడా ఆయన పేర్కొన్నారు.

ఆస్కార్‌తో గ్లోబల్ క్రేజ్

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన RRR, విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు... అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టించింది. 2022లో విడుదలైన RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారత స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా రూపొందినఈ సినిమా.. హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, గ్రాండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ముఖ్యంగా ' 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడంతో భారతీయ సినిమాపై ప్రపంచ దృష్టి పడింది. అంతేకాదు, జపాన్ మార్కెట్‌లో కూడా RRR అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. అక్కడ థియేటర్లలో భారీ స్పందన దక్కడమే కాకుండా, ఇటీవల జరిగిన IMAX రీ-రిలీజ్‌లతో మరోసారి కొత్త ఫ్యాన్స్‌ను సంపాదించుకుని, గ్లోబల్ స్థాయిలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది.

జపాన్ స్టూడియోలతో టచ్...
రాజమౌళి జపాన్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. తర్వాత, ప్రముఖ ఆనిమే సంస్థ స్టూడియో ట్రిగ్గర్ (Studio Trigger) పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. 'కిల్ లా కిల్', 'సైబర్‌పంక్: ఎడ్జ్‌రన్నర్స్' వంటి పాపులర్ ఆనిమేలకు ఈ స్టూడియో పేరు గాంచింది. అంతేకాదు, ఈ స్టూడియోకు చెందిన ఆర్టిస్ట్ యోహ్ యోషినారి (Yoh Yoshinari) ఆర్‌ఆర్‌ఆర్ పాత్రలను యానిమే స్టైల్‌లో రూపొందించిన ఆర్ట్‌వర్క్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర్ట్‌లో రామ్ చరణ్ గుర్రంపై యాక్షన్ పోజ్‌లో, ఎన్టీఆర్ మోటార్‌బైక్‌పై కనిపిస్తూ ఫైర్-వాటర్ థీమ్‌తో డిజైన్ చేయడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

'బాహుబలి' తరహాలోనే RRR ఫ్రాంచైజ్?
ఇంతకుముందే రాజమౌళి 'బాహుబలి' సిరీస్‌ను ఆనిమేటెడ్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో RRRను కూడా ఆనిమే సిరీస్ లేదా ఫిల్మ్‌గా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా భారతీయ సినిమా - జపాన్ ఆనిమే ప్రపంచం కలిసే అరుదైన కలయిక జరగనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఐడియా స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ, రాజమౌళి నుంచి వచ్చిన అధికారిక మాటలతో RRR ఆనిమేపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే... టాలీవుడ్ మరోసారి గ్లోబల్ స్థాయిలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan rrr ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X