బాహుబలి కంటే హై రేంజ్ లో RRR హక్కులు.. అస్సలు తగ్గట్లేదుగా
ఓ వైవు నందమూరి అభిమానులు మరోవైపు మెగా అభిమానులు RRR కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథనాయకులుగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా బిజినెస్ పై కూడా అంచనాకు భరిగానే ఉన్నాయి. చూస్తుంటే పాత బహుబలి రికార్డులను కూడా బ్లాస్ట్ చేసేలా ఉన్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది.
మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినప్పటికీ సమస్య తీరలేదు. ఈ రిలీజ్ డేట్ మళ్ళీ మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్షన్స్ బాగా రావాలి అంటే దసరా కంటే సంక్రాంతి బెటర్ అని డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతతో చర్చలు జరుపుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. సినిమాకు సంబంధించిన అన్ని ఏరియా హక్కులు చాలా వరకు బాహుబలి కంటే అత్యదిక ధర పలుకుతున్నట్లు సమాచారం.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా ఎక్కువగా మార్కెట్ ఉన్న ఏరియాల్లో సీడెడ్ ఒకటి. అక్కడ ఈ హీరోల ప్రతి సినిమా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ చాలా బలంగా ఉంటాయి. ఇక ఇప్పుడు RRR రైట్స్ ఏకంగా 45కోట్ల ధర పలుకుతున్నట్లు సమాచారం. అంటే బహుబలి 2 కంటే 10కోట్లు ఎక్కువన్నమాట. ఆ సినిమాకు 35కోట్ల ధర పలికింది. మరి RRR బాహుబలి 2 కంటే అత్యదిక షేర్స్ ను అందిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే మరో అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











