మరో సంచలనం రికార్డు బద్దలు కొట్టిన RRR.. మహేష్ సెంటిమెంట్ విషయంలో లైన్ క్లియర్?

తెలుగు సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం RRR. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మార్చి 25వ తేదీన గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి కొద్ది రోజులలో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా మరో రికార్డు బద్దలు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...

క్రేజ్ దృష్ట్యా

క్రేజ్ దృష్ట్యా


బాహుబలి ఫ్రాంచైస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి RRR అనే సినిమా ప్రకటించారు. తెలుగులో ఇద్దరు బడా హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలుత తెలుగు వరకు పరిమితం చేద్దామని అనుకున్నారు కానీ బాహుబలితో వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగానే బాలీవుడ్ నుంచి అలియాభట్ హాలీవుడ్ నుంచి ఒలీవియా మోరిస్ లను రంగంలోకి దింపారు.

 ఇతర కీలక పాత్రల్లో

ఇతర కీలక పాత్రల్లో


ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్ నటించగా కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ నటించిన కొమురం భీం పాత్ర సరసన జెన్నీ పాత్రలో ఒలీవియా మోరిస్ నటించింది. ఇక ఈ సినిమాలో వీరు కాకుండా అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్పాండే వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

 RRR చిత్రం రికార్డు

RRR చిత్రం రికార్డు


రిలీజ్ అయ్యి ఇంత కాలం అయినా...వీక్ డేస్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గుతున్నాయి కానీ వీకెండ్ లో మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఇక సినిమా వాళ్లు కలెక్షన్స్ లెక్కేసేటప్పుడు...ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. హిట్ సినిమా అక్కడ ఆడే లెక్కలను లెక్కలు వేస్తూ ఉంటారు. ఇక తాజాగా RRR చిత్రం అక్కడ రికార్డు క్రియేట్ చేసింది.

 5 కోట్ల గ్రాస్ వసూలు

5 కోట్ల గ్రాస్ వసూలు


ఇప్పటివరకు RRR సినిమా సుదర్శన్ 35 mm థియేటర్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ క్రమంలో మహేష్ కు సెంటిమెంట్ థియేటర్ అయిన ఈ సినిమాలో సర్కారు వారి పాట సినిమా రిలీజ్ చేసేందుకు అడ్డంకులు తొలగినట్లే అని కొందరు అంటున్నారు.

వదులుతారేమో

వదులుతారేమో


నిజానికి అక్కడ విడుదల చేసిన అన్ని మహేష్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అక్కడ RRR ప్రదర్శితం అవుతూ ఉండడంతో రిలీజ్ అయిన రోజు ఆ తరువాతి రోజు కేవలం రెండు షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు RRR రికార్డు కొట్టేసింది కాబట్టి ఏమైనా వదులుతారు ఏమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X