Don't Miss!
- Sports
వీడియో: క్షణం..క్షణం టెన్షన్‌తో: ఢిల్లీ కేపిటల్స్ ఓటమితో పండగ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్
- News
పెండింగ్‌లో ఏపీసీసీ చీఫ్ పదవి..!! కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకత?
- Finance
Gold Prices Today: భారీగా తగ్గి, పెరిగిన బంగారం ధరలు
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ట్విస్టు.. ఏపీలో రేటుపై మరో కొత్త డిమాండ్
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి రానున్న RRR సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని మొన్నటి వరకు కూడా అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ ఉంటే మాత్రం సినిమా కలెక్షన్స్ మెల్లమెల్లగా తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. ఓపెనింగ్స్ విషయంలో నిర్మాతలు నమ్మకంతోనే ఉన్నప్పటికీ పరిస్థితులు ఏ విధంగా మారుస్తాయో అనే విషయంలో కూడా చాలా టెన్షన్ గా ఉన్నారు. ఆంధ్ర ఏరియాలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ లెక్కలు కూడా మరి కొంత తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

పవర్ఫుల్ హీరోలు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా RRR సినిమా కోసం ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ స్థాయిని మరొక లెవెల్ కు చేర్చుతుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా పవర్ ఫుల్ గా ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రలో అలరించబోతున్నారు.

ఓపెనింగ్స్ తక్కువగానే..
RRR సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొన్ని లెక్కలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా అయితే టాక్ వచ్చింది.
మొన్నటి వరకు ఆ విషయం నిజమే అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం కరోనా ప్రభావం మరింత ఎక్కువగా పెరగడంతో థియేటర్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందట. దీంతో ఓపెనింగ్స్ అయితే అంచనాల కంటే కూడా తక్కువగానే వస్తాయి అని అర్థమవుతోంది.

మళ్ళీ తగ్గనున్న RRR
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా అగ్ర హీరోలు. దానికితోడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక హీరోయిన్ అలియా భట్, ఒక పవర్ ఫుల్ పాత్రలో అజయ్ దేవగన్ ఇలా భారీ తారాగాణంతో రూపొందిన ఈ సినిమాను తప్పకుండా చూడాలి అని ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమయంలో సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ చాలావరకు రేట్లను తగ్గించాలి అనే నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో..
కేవలం ఆంధ్ర నైజాం లోనే మొదట RRR సినిమా 200 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి నైజాంలో 110 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసిందే. ఇక ఇప్పటికే తెలంగాణలో ఒక నమ్మకం అయితే ఉంది. ఇక ఆంధ్రాలో మాత్రం పరిస్థితులను ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి సినిమా రేషియో లో చాలా వరకు తగ్గిస్తూ వచ్చారు.

మళ్ళీ కొత్త డిమాండ్?
ఇటీవల ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ 70 కోట్ల రేషియోను మళ్లీ తగ్గించాలని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. 50 నుంచి 55 కోట్ల మధ్యలో RRR సినిమా కు చాలా తక్కువస్థాయిలోనే డీల్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు థియేటర్లను మూతపడుతున్నాయి. ముందుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కాబట్టి ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయలేక తక్కువ రేషియో కోసం చర్చలు జరుపుతున్నారట. మరి సినిమా మొదటిరోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.