Just In
- 5 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 6 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 6 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 7 hrs ago
బ్లాక్లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాక్ ఆఫ్ ది టౌన్: బాలయ్యకు RRR యూనిట్ సాయం.. వెంటనే ఫిక్స్ చేసేసిన నందమూరి హీరో.!
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబో ఒకటి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలే దీనికి ఉదాహరణ. రెండు భారీ హిట్ చిత్రాల తర్వాత ఈ జంట మరోసారి కలిసిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అలాగే, ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే....

బాలయ్య అస్సలు కలిసి రాలేదు
2019 నందమూరి బాలకృష్ణకు అస్సలు కలిసి రాలేదు. పైగా ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. దీనికి కారణం.. పోయిన సంవత్సరంలో ఆయన నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ‘యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలతో పాటు ‘రూలర్' ఉన్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూడు సినిమాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.

హ్యాట్రిక్‌కు రెడీ.. దర్శకుడి నయా ప్లాన్స్
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాలయ్య.. తనకు రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీనికి కారణం.. స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు తీసుకుంటున్న జాగ్రత్తలే అని సమాచారం.

ఆ ఒక్కటి క్లారిటీ వస్తే.. అన్నీ కుదిరినట్లే
ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో నటించే ఆర్టిస్టుల గురించే ఎక్కువగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదని తెలుస్తోంది. హీరోయిన్‌ను ఫైలన్ చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ఉరకలెత్తే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఎవరూ ఊహించని పాత్రలో బాలయ్య
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గుండుతో కనిపించి షాకిచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయన పాత్రకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి అఘోరా రోల్ అని ప్రచారం జరుగుతోంది.

బాలయ్యకు RRR యూనిట్ సాయం
ఇంకా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. షూటింగ్‌కు ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందట. గతంలో RRR సినిమాను రిలీజ్ చేయాలనుకున్న జూలై 30, 2020నే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

వెంటనే ఫిక్స్ చేసేసిన నందమూరి హీరో.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో RRR ఒకటి. ఈ సినిమాను మొదట జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఇటీవల దాన్ని జనవరి 8, 2021కి మార్చింది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే బాలయ్య.. తన సినిమాను ఆరోజున విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం.