RRR ఫుల్‌ఫామ్: అక్కడ అదే.. మరి ఇక్కడ? ఓట్లన్నీ దానికే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు RRR మూవీ పైనే ఉంది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ సెట్స్‌పై కదులుతోంది. రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఈ పాన్ ఇండియా మూవీపై జనాల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. మేజర్ పార్ట్ షూటింగ్ కూడా ఫినిష్ అయింది. ఈ నేపథ్యంలో RRR ఫుల్‌ఫామ్ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి.

Recommended Video

RRR Makers To Finalize This Title ? | Filmibeat Telugu
 వర్కింగ్ టైటిల్.. మీరే చెప్పండన్న జక్కన్న

వర్కింగ్ టైటిల్.. మీరే చెప్పండన్న జక్కన్న

సినిమా మొదలుపెట్టిన రోజే RRR అనే వర్కింగ్ టైటిల్‌లో సెట్స్ మీదకు వస్తున్నామని ప్రకటించారు రాజమౌళి. చెప్పినట్లుగానే RRR రూపంలో షూటింగ్ చేస్తూ చివరిదశకు తీసుకొచ్చారు. కానీ ఈ టైటిల్ ఫుల్‌ఫామ్ విషయంలో మాత్రం ఇప్పటిదాకా అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. పైగా మీరే చెప్పండి అంటూ ఆ బాధ్యత ప్రేక్షకులకే అప్పజెప్పాడు జక్కన్న.

 ప్రేక్షకులను కోరిన రాజమౌళి.. స్పందన చూస్తే!

ప్రేక్షకులను కోరిన రాజమౌళి.. స్పందన చూస్తే!

RRR వర్కింగ్ టైటిల్ కు సరిపోయే మంచి టైటిల్‌ను సూచించాలని ఇటీవలే ప్రేక్షకులను కోరింది చిత్ర యూనిట్. అయితే జక్కన్న వేసిన ఈ ఆర్డర్‌పై నెటిజన్ల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చిందని సమాచారం. రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్ టైటిల్స్‌పై బాగా మక్కువ చూపారు ఆడియన్స్.

ఓట్లన్నీ దానికే.. అందుకే!!

ఓట్లన్నీ దానికే.. అందుకే!!

రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్ టైటిల్స్‌ పోటీ పడినప్పటికీ ఎక్కువ శాతం మంది 'రామ రావణ రాజ్యం' టైటిల్ కోరుకుంటున్నట్లుగా తెలిసింది. మరోవైపు హిందీలో ఈ సినిమాకు 'రామ్ రావణ్ రాజ్' టైటిల్ ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ పరిణామాలు చూసి 'రామ రావణ రాజ్యం' ఫిక్స్ అయినట్లే అని భావిస్తున్నారు జనం.

ఎన్టీఆర్, రామ్ చరణ్..

ఎన్టీఆర్, రామ్ చరణ్..

డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ RRR మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిపై మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 80 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేశారని లేటెస్ట్ సమాచారం.

ఇద్దరు హీరోయిన్స్.. హీరోల క్యారెక్టర్స్

ఇద్దరు హీరోయిన్స్.. హీరోల క్యారెక్టర్స్

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండటం విశేషం. ఈ చారిత్రిక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారారాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X