మరో అడుగు ముందుకేసిన RRR హీరోయిన్.. వీడియో ద్వారా చెప్పేసింది

Recommended Video

Actress Alia Bhatt Launches Her Youtube Channel | RRR | Ram Charan | Jr NTR || Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సరికొత్తగా ఆలోచించింది. తనకు, తన సినిమాలకు సంబందించిన అన్ని వివరాలు అభిమానులతో పంచుకోవడానికి గాను యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఇప్పటికే ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లలో యాక్టీవ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ భామ.. ఇక యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా అభిమానులకు టచ్ లో ఉంటానని చెబుతోంది. పూర్తి వివరాలు చూస్తే..

యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించా

యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించా

తాను యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించానని పేర్కొంటూ ట్వీట్ చేసింది ఆలియా. ఈ మేరకు వీడియో షేర్ చేస్తూ తన యూ ట్యూబ్ ఛానెల్ కి సంబందించిన వివరాలు తెలిపింది. సమ్‌థింగ్ న్యూ, సమ్‌థింగ్ ఫన్, సమ్‌థింగ్ ఆన్ యూ ట్యూబ్ అని ట్యాగ్ చేసి ఆకట్టుకుంది. ఈ యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా తన విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆలియా.

మంచి, చెడు అన్నీ చెబుతా

ఈ సందర్బంగా తన యూ ట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన తొలి వీడియోలో ఆలియా మాట్లాడుతూ.. ''ఇప్పటిదాకా నేను ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ల ద్వారా మీతో టచ్ లో ఉన్నాను. ఇప్పుడు యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా మీ ముందుకు వస్తున్నా. ఈ ఛానెల్ లో నాకు సంబందించిన మంచి, చెడు అన్ని వివరాల తాలూకు వీడియోలు పోస్ట్ చేస్తుంటా'' అని పేర్కొంది.

భారీ రెస్పాన్స్.. పాజిటివ్‌ రియాక్షన్

భారీ రెస్పాన్స్.. పాజిటివ్‌ రియాక్షన్

జూన్ 26 వ తేదీన ఆలియా తన యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించగా.. రెండు రోజుల్లోనే ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఛానెల్‌కి 3 లక్షల 68 వేల మంది ఫాలోవర్స్ జమయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఆలియా చేసిన ఈ ఆలోచనపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు ప్రేక్షకులు.

 రాజమౌళి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

రాజమౌళి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించిన ఆలియా భట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా నటించనుంది. మరోవైపు బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర' లోనూ ఆలియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X