Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అలియాభట్‌కు కరోనావైరస్ పాజిటివ్.. రాజమౌళికి మరో షాక్.. RRR షూట్ మళ్లీ వాయిదా?
బాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనావైరస్ వెంటాడుతున్నది. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ కోవిడ్19 బారిన పడ్డారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖుల్లో రణ్‌బీర్ కపూర్, అమీర్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్‌పేయి, సిద్దార్థ్ చతుర్వేది, తారా సుతారియా, సతీష్ కౌశిక్, అజయ్ దేవగన్, సంజయ్ లీలా భన్సాలీ కరోనావైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
గత నెల సంజయ్ లీలా భన్సాలీ కరోనావైరస్ పాజిటివ్ నుంచి తేరుకొని ముంబైలోని స్టూడియోలో గంగూభాయ్ కతియావాడి చిత్రానికి సంబంధించిన పాటను షూట్ చేస్తున్నారు. ఈ షూట్లోనే అలియాభట్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్య పరీక్షలు జరిపించగా ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని తల్లి సోని రజ్దాన్ ధృవీకరించారు. అంతేకాకుండా గంగూభాయ్ కతియావాడి టీమ్‌లో కూడా పలువురికి కరోనావైరస్ సోకినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, దర్శకుడు రాజమౌళికి అలియాభట్ మరోసారి షాకిచ్చింది. అలియాభట్ కారణంగా RRR సినిమా షూట్ పలుమార్లు వాయిదా పడింది. గతంలో ప్రియుడితో అలియాభట్ అమెరికాకు వెళ్లడం, అలాగే కుటుంబంలో పెళ్లి అనే కారణంతో మరోసారి, అంతేకాకుండా రణ్‌బీర్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే మిషతో RRR షూటింగ్ వాయిదా పడినట్టు వార్తలు వచ్చా.యి. అయితే ఎలాగైనా ఏప్రిల్‌లో అలియాభట్‌తో షూటింగు పూర్తి చేయాలని భావిస్తున్న తరుణంలో తాజాగా మరోసారి షాకిచ్చింది.
అలియాభట్‌కు కరోనావైరస్ సోకడంతో కనీసం మరో 15 రోజులు RRR షూట్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.