RRR నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్: క్యూట్ లుక్‌తో ఫిదా చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో తెలుగు నటులతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్లు కూడా చేస్తోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా ఇంగ్లీష్ నటి ఒలీవియా మోరిస్ చేస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది యూనిట్.
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ సినిమాలో 'జెన్నీఫర్'గా నటిస్తోన్న ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నేడు పుట్టినరోజు జరుపుకుంటోన్న ఈ హాలీవుడ్ భామకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ పోస్టర్ చూసిన వారందరూ ఒలీవియా లుక్‌కు ఫిదా అయిపోతున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.

ఇక, ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్లైమాక్స్‌కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసి.. ఈ సారైనా అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇదిలా ఉండగా.. ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోండగా.. అజయ్ దేవగణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే, హాలీవుడ్ నుంచి రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ కూడా నటిస్తున్నారు. వీరితో పాటు రాహుల్ రామకృష్ణ, సముద్రఖని సహా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











