Jr NTR Birthday: RRR సర్‌ప్రైజ్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్.. సిద్ధంగా ఉండండి!
టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా నందమూరి వారసులు ఏకమై స్క్రీన్ షేర్ చేసుకోవడంతోనే అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక సినిమాకు సంబంధించిన అసలైన అప్డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ఫుల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు.

ఆశపడుతున్న అభిమానులు
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా , జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్టార్స్ యొక్క హై వోల్టేజ్ టీజర్స్ ను విడుదల చేశారు. అయితే ఈసారి మరొక పుట్టినరోజు రావడంతో అభిమానులు మరొక టీజర్ ను చూడాలని ఆశపడుతున్నారు.

పవర్ఫుల్ లుక్కుతో..
మొదట పుట్టినరోజు సందర్భంగా క్యారెక్టర్ల టీజర్స్ తో హ్యాపీ చేసిన జక్కన్న అనంతరం స్పెషల్ ఇంటెన్స్ పోస్టర్స్ అంటూ బాగానే ఆకట్టుకుంటున్నాడు. అసలైతే గత ఏడాది తారక్ పుట్టిన రోజున కాకుండా కరోనా వలన టీజర్ ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ పుట్టినరోజున టీజర్ కాకుండా పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

బుధవారం 10గంటలకు
మే 20న జూనియర్ ఎన్టీఆర్ 38వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈసారి అభిమానులు పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ కారోనా సెకండ్ వేవ్ మరోసారి దెబ్బ కొట్టింది. ఇక బుధవారం ఉదయం 10గంటలకు సినిమాకు సంబంధించిన ఒక ఇంటెన్స్ కొమురం భీమ్ లుక్కును చూపించబోతున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.

ఇంకా చాలా సమయం ఉండడంతో..
మొదట ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేయవచ్చని టాక్ వచ్చింది. కానీ సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పుడే ఎక్కువగా టీజర్స్ ను వదలద్దని దర్శకుడు రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడట. అందుకే పవర్ఫుల్ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మరి ఆ లుక్కు అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











