'ఆర్ఆర్ఆర్' గురించి ఆసక్తికరమైన అప్డేట్!

Recommended Video

RRR Makers Aiming At November Launch For The Film

బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. రాజమౌళి తదుపరి చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇంతవరకు సినిమా లాంచ్ కాలేదు. తాజగా ఈ చిత్రానికి లాంచింగ్ కి సంబందించిన వార్త ఆసక్తికరంగా మారింది.

ఎన్నో ఊహాగానాలు

ఎన్నో ఊహాగానాలు

రాజమౌళి తెరకెక్కించబోయే ఈ భారీ మల్టీస్టారర్ గురించి ఎన్నో ఊహాగానాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. బాక్సింగ్ కథ అంటూ, పునర్జన్మల కథ అంటూ, స్వాతంత్ర సమరం నేపథ్యంలో కథ అంటూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు రాజమౌళి టైటిల్ కూడా ప్రకటించలేదు.

 300 కోట్ల బడ్జెట్

300 కోట్ల బడ్జెట్

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం కళ్ళు చెదిరే విధంగా రూపొందబోతోంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. షూటింగ్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడట.

ముహూర్తం

ముహూర్తం

తాజగా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట.

 2020లో విడుదల

2020లో విడుదల

ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ 2020 ఆరంభం వరకు కొనసాగుతుందట. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి 2020 వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత అక్టోబర్ 11 న విడుదలకు సిద్ధం అవుతోంది. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X