RRRకు మరో ఆస్కార్ గౌరవం .. ఆ కేటగిరీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు సర్‌ప్రైజ్

ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత అవార్డులలో ఆస్కార్ ముందు వరుసలో ఉంటుంది. నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు ఇండస్ట్రీలోని 24 విభాగాల వారు ఆస్కార్ అవార్డ్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అందరికీ అదృష్టం వరించదు. ఏళ్లకు ఏళ్లు ఈ పురస్కారం తమకు రాకపోతుందా అని ఎదురుచూసేవారు ఎందరో. కెరీర్ ముగిసేలోగా ఎలాగైనా ఆ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవాలని ప్రయత్నించేవారెందరో.

ఇక భారతీయుల విషయానికి వస్తే ఆస్కార్ అవార్డును ఇప్పటి వరకు భాను ఆతయ, సత్యజిత్ రే, రాహుల్ పుకుట్టి, గుల్జర్, ఏఆర్ రెహమాన్, కార్తీకి గోన్‌స్లావ్స్, గునీత్ మోంగా, రాహుల్ తక్కర్, వికాస్ సాతే, లియోన్ తదితరులు పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో 2023లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన ఎంఎం కీరవాని, గీత రచయిత చంద్రబోస్‌లు ఆస్కార్ వేదికపై అవార్డును అందుకున్నారు.

RRR mention in Oscars New Stunt Design category poster

ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ ఘనతతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసే పరిస్ధితి నెలకొంది. దర్శకుడిగా రాజమౌళి ఘనత ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు గ్లోబల్ ఇమేజ్‌తో గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ నుంచి మరో గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ కమిటీ కొత్తగా కొన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

స్టంట్ డిజైన్ కేటగిరీలో అవార్డులను ఇస్తున్నట్లు తెలిపిన అకాడమీ.. 100వ అకాడమీ అవార్డుల వేడుకల్లో (2028) స్టంట్ డిజైన్ కేటగిరీ కింద అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపింది. అయితే కొత్త కేటగిరీని ప్రకటిస్తూ ఆస్కార్ కమిటీ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో మూడు సినిమాలలోని ఫోటోలు ఉన్నాయి. అందులో ఆర్ఆర్ఆర్‌కు కూడా స్థానం దక్కింది. ఇంటర్వెల్ బ్లాక్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పులితో ఫైట్ చేసే సీన్‌లోని ఓ షాట్‌ను ఆస్కార్ ఉపయోగించింది.

మిగిలిన రెండు సినిమాల విషయాని వస్తే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు. ఈ సినిమాల్లోని స్టంట్ సీన్స్‌తో ఆస్కార్ పోస్టర్‌ను వదిలింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కినట్లయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో సినిమాలను దాటుకుని ఆర్ఆర్ఆర్‌కు ఈ గౌరవం దక్కడంపై రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆస్కార్, ఆర్ఆర్ఆర్ పోస్టర్‌లతో ప్రస్తుతం సోషల్ మీడియా నిండిపోతోంది.

ఆస్కార్ కొత్త కేటగిరీ పోస్టర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ షాట్‌ను వాడటంపై ఎస్ఎస్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆర్ఆర్ఆర్ దృశ్యాన్ని చూసి థ్రిల్ అయ్యానని రాజమౌళి ఎక్స్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ 2027లో రిలీజయ్యే సినిమాలకు స్టంట్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ ఇవ్వడంపై రాజమౌళి సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్ణయం వెలువడటం వెనుక కృషి చేసిన అకాడమీ సీఈవో బిల్ క్రామర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్, స్టంట్ నిపుణులకు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

More from Filmibeat

Read more about: academy awards oscar rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X